Ragi Chembu : రాగి చెంబు తో ఇలా చేస్తే.. సంపదకు తిరుగుండదు..!!

Ragi Chembu : హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క పనిలో కూడా ఏదో ఒక అర్థం , పరమార్థం దాగి ఉంటుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో మంచి చెడు అనేది ఉంటాయి కాబట్టి మనకు ఏదైతే దేవుడు చెడిన సృష్టిస్తాడో.. అదేవిధంగా మంచిని కూడా సృష్టిస్తాడు. అంతేకాదు కర్మల ఫలితంగా దేవుడు ఫలితాలను అందిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కూడా దేవుడు చూపిస్తాడు అని చాలామంది నమ్మకం. కానీ జీవితంలో ఎంత సంపాదించినా.. ఎంత కష్టపడినా సరే అదృష్టమనేది కలిసిరాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

జాతకరీత్యా నవగ్రహాలు, దుష్ట గ్రహాలు సమస్యలు ఏదైనా సరే తంత్ర మంత్ర యంత్రాలతో పరిహారం అనేది సృష్టించడం జరిగింది. ముఖ్యంగా 12 రాశుల వారిలో కొంతమందికి తప్పకుండా నాగదోషం అనేది ఉంటుంది. నాగ దోషం కూడా పన్నెండు రకాలు ఉంటుంది. ఎన్ని దోషాలు ఉన్నా వాటికి పరిహారాలు మాత్రం తప్పనిసరిగా ఉన్నాయి. దోషం ఉన్నప్పుడు పెళ్లి కాకపోవడం, ఆర్థిక సమస్యలు, సంతానం కలగకపోవడం , డబ్బు చేతికి అందినట్టే అంది ఆర్థిక నష్టం రావడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. నాగ దోషం ఉన్నప్పుడు పరిహారం కూడా మనం తెలుసుకోవాలి.వెండి తాయత్తులు గానీ..

Doing so with Ragi Chembu will turn into wealth
Doing so with Ragi Chembu will turn into wealth

రాగి తాయత్తులు గానీ తీసుకొని ఆదివారం లేదా మంగళవారం రోజు మీకు అనువైన రోజులు చూసుకొని రెండు రాగి చెంబులు తీసుకొని.. ఒక చెంబులో పాలు.. మరొక చెంబులో నీళ్ళు పోసి పుట్ట దగ్గరకు వెళ్లి చెంబులో నీళ్లు చల్లి పసుపు, కుంకుమ, అగరవత్తులతో దీపం వెలిగించాలి. ఇక మీరు తెచ్చిన పాలు పుట్టలో పోసి.. గోత్ర నామాలు తలుచుకుంటూ మీ సమస్యలను చెబుతూ తొలగిపోవాలని కోరుకోవాలి. ప్రదక్షిణాలు చేసి నాగదేవతకు దండం పెట్టిన తర్వాత పుట్ట దగ్గర నుంచి పసుపు , కుంకుమ వేసి కొద్దిగా మట్టి తీసుకుని మనం తీసుకొని పోయిన తాయత్తులు అక్కడే ఉంచి అగరవత్తులు మెడలో వేసుకోవాలి. ఇలాచేస్తే నాగ దోషం తొలగి పోయి .. ఆర్థిక కష్టాలు ఉంటే తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది.