Akshintalu : అక్షింతలు తలమీద ఎందుకు వేస్తారో తెలుసా..?

Akshintalu : భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలు చాలానే ఉన్నాయి.దేవాలయాల్లో పూజారులు భక్తుల తలపై అక్షింతలు ఎందుకు వేస్తారో, దేవాలయంలో కాకుండానే ఇంట్లో కూడా వ్రతాలు గానీ ఏదైనా పూజ చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు మన తలపై పోస్తారు. అయితే అక్షింతల కు బియ్యానికి పసుపుని కలిపి వేసి దీవిస్తారు. దీనితో పాటుగా దేవాలయాలలోని విగ్రహాలపై అక్షింతలు వేసి ముక్కుతూ ఉంటారు. ఇక అంతే కాకుండా మన ఇంట్లో పెద్దలు కూడా మన పై ఈ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే అక్షింతలతో అలా ఆశీర్వదిస్తే ఎలాంటి లాభం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.అక్షింతలు అంటే అవి క్షతం కానీ అని చెబుతూ ఉంటారు..

ఇంట్లో బియ్యాన్ని తీసుకొని కాస్త పసుపు అలాగే నెయ్యి తో కలిపిన వాటిని అక్షింతలు అంటారు. ఇలాంటి బియ్యం అంటే చంద్రుడికి చాలా ప్రీతం. ప్రశాంతతకు గొప్పవాడైన చంద్రుడి ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు.. అందుచేతనే మనిషి యొక్క మనసు, గుణము, బుద్ధి ఇవన్నీ చంద్రుడు పైన ఆధారపడి ఉంటాయట. అందుచేతనే ఆ చంద్రుడికి ఇష్టమైన బియ్యంతో కూడా మనిషి ని ఆశీర్వదిస్తే ఆ మనిషి ధర్మాన్ని నియంత్రణ చేస్తారని మన పెద్దలు తెలుపుతూ ఉంటారు.అక్షింతలు తలపై వేసే సమయంలో లో మన దేహంలోని కొంత విద్యుత్ అక్షింతలను తాకుతోంది. ఇక అంతే కాకుండా ఆశీర్వదించే వారి నుండి కూడా కొంత విద్యుత్ సరఫరా అవుతుందట.

Do you know why the Akshintalu are placed on the head
Do you know why the Akshintalu are placed on the head

అందుచేతనే అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ ను గ్రహించి ఆ సరఫరా మన శరీరానికి చేరడం జరుగుతుందట. దీనివల్ల మన శిరస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక అంతే కాకుండా ఆశీర్వదించి నటువంటి పెద్దవాళ్ల సాత్విక గుణం, బుద్ధులు చిన్నపిల్లలకు అక్షింతల ద్వారా లభిస్తాయని మన పూర్వీకులు తెలుపుతూ ఉన్నారు. అయితే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే జీవనాధారానికి సంకేతం బియ్యం అని చెబుతారు. మనం తినే ఆహారం బియ్యంతోనే తయారవుతుంది. కాబట్టి ఆ బియ్యంతోనే మన నెత్తి పైన వేసి ఆశీర్వదిస్తారని చెబుతూ ఉంటారు.