Diabetes : డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి పండ్లు తినొచ్చు..!

Diabetes : మనిషి యొక్క ఆరోగ్యాన్ని నెమ్మదిగా పాడు చేసే వ్యాధులలో డయాబెటిస్ కూడా ఒకటి . ఇది ఒకసారి వచ్చింది అంటే మనిషి యొక్క అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తూ చివరికి పూర్తిగా పాడు చేస్తుంది. అందుకే డయాబెటిస్ రాకుండా చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ వచ్చినా సరే దానిని అదుపులో ఉంచడానికి మనం కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఈ మధ్య కాలంలో రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.. 20, 30 సంవత్సరాలకే వస్తుంది.. ఇక షుగర్ అధికంగా ఎవరికి వస్తుంది అంటే అధిక బరువు , శారీరక శ్రమ లేని వారికి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది.

మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది . ముఖ్యంగా డయాబెటిస్ వారు కొన్ని రకాల పండ్లు తినకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కేవలం కొన్ని పండ్లకు మాత్రమే దూరంగా ఉండాలి.. ఎందుకంటే ఇక పనులన్నీ తినడం మానేస్తే పండ్ల నుండి లభించే పోషకాలు మన శరీరానికి అందవు.. కాబట్టి చక్కెర అధికంగా ఉండే పండ్లు దూరంగా ఉంచాలి. సీతాఫలం లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి.. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ పండుకు చాలా దూరంగా ఉండటం మంచిది.దానిమ్మ అనేది డయాబెటిస్ వారికి ఒక మంచి ఆహారం.. కాని ఎక్కువగా తీసుకోకూడదు .. కేవలం ఒక రోజు ఒక కాయ తింటే సరిపోతుంది.

What kind of fruits can people with diabetes eat
What kind of fruits can people with diabetes eat

. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. అరటి పండు కూడా డయాబెటిస్ వారు సగం మాత్రమే తీసుకంటే చాలు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే అరటిపండులో కూడా చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి.. ఇందులో ఉండే పోషకాల బరువును తగ్గించడంలో.. మలబద్దకం సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. ఆపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఇక డయాబెటిస్ రోగులు కూడా రోజుకు ఒక ఆపిల్ తింటే వారికి ఎలాంటి సమస్యలు రావు. కానీ ఎక్కువ తింటే మాత్రం సమస్యలు తప్పవు.