మీ ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే మంచిదో తెలుసా..?

గృహమే కదా స్వర్గసీమ అంటారు. అలాంటి ఇంటి వల్ల మనకు అంతా మంచే జరగాలి కానీ ఇంట్లో అడుగుపెట్టగానే సమస్యలు, ఆందోళన, ఇంట్లో ఉండలేక పోవడం వంటి సమస్యలు తలెత్తకూడదు. ముఖ్యంగా వాస్తు పట్టింపు ఉండే వారికి మాత్రం ఇలాంటివి చాలా ఎక్కువగా పాటించాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంటి తలుపులు కూడా వాస్తులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక వాస్తు ప్రకారం ఇలాంటి ఇంటి స్థలం లేకుంటే మనశ్శాంతి ఉండదు. అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది. ద్వారాలు అంటే కేవలం గదులకు రక్షణ కోసం మాత్రమే కాదు ఇంట్లో నివసించే వారి వివిధ స్థితిగతులను కూడా మారుతుందని విశ్వసిస్తారు.ముఖ్యంగా ఇంటి ద్వారాలు , కిటికీలు కూడా సరి సంఖ్యలో ఉండాలి. కానీ చివర్లో సున్నా మాత్రం ఉండకూడదని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Do you know how many doors are good for your house
Do you know how many doors are good for your house

రెండు ద్వారాలు.. ఆ ఇంట్లో వారు ఎప్పుడూ సంతోషంగా, ఆర్థికంగా నివసిస్తూనే అభివృద్ధి చెందుతారు.
మూడు ద్వారాలు: ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు సాగుతూనే ఉంటాయి . ఇంట్లో గొడవలు చాలవన్నట్టు కొత్త శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు.
నాలుగు ద్వారాలు: ఆ ఇంట్లో ఉండే వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది.
ఐదు ద్వారాలు: అనారోగ్య సమస్యతో పాటు ఇంటిలోని వారు ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఆరు ద్వారాలు: ఇంట్లో ఉండేవారికి సంతానప్రాప్తి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
ఏడు ద్వారాలు: ఆ ఇంట్లో నివాసం ఉండే వారిని అపాయాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఎనిమిది ద్వారాలు: ఇంటిలోని వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఐశ్వర్యం, సౌభాగ్యంతో తులతూగుతూ ఉంటారు.
తొమ్మిది ద్వారాలు: రోగాలు పట్టి పీడిస్తాయి.
పది ద్వారాలు: ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
పదకొండు ద్వారాలు : ఇంట్లో అష్టకష్టాలు అనుభవించక తప్పదు.
పన్నెండు ద్వారాలు: ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి కీర్తి కలుగుతుంది.
పదమూడు ద్వారాలు: మరణ ప్రమాదం , ఎడతెరిపి లేని కష్టాలు అనుభవిస్తారు.
పద్నాలుగు ద్వారాలు: ధన సంపద , కుటుంబ వృద్ధి కలుగుతుంది.
పదిహేను ద్వారాలు: ఎన్నో కష్టాలు, బాధలు , అశాంతి, అధిక నష్టాలు కలుగుతాయి.
పదహారు ద్వారాలు: ఏ పని తలపెట్టినా లాభం , అధికార యోగం కలుగుతుంది.
అందరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సప్ ద్వారా షేర్ చేయగలరు.