According : పురాణాల ప్రకారం ఏ కన్ను అదిరితే ఏమవుతుంది..అలాగే సైన్స్ ఏం చెబుతోందంటే..?

According : మన శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నప్పటికీ మనకి చాలా ముఖ్యమైనవి కళ్ళు.. అయితే ఈ కళ్లను మనం బాగా గమనించినట్లయితే అప్పుడప్పుడు మనకి ఆదరడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జరగడం వల్ల మనం ఎక్కువగా శకునం గా భావిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా ఆడవారికి కుడి కన్ను, పురుషులకు ఎడమ కన్ను అదరడం వల్ల అనర్ధాలు జరుగుతాయి అని చాలామంది నమ్ముతుంటారు. అందుకు కారణం ఏమిటంటే మన పురాణాల ప్రకారం సీతాదేవిని రావణాసురుడు తీసుకొని వెళ్లేటప్పుడు ఆమెకు కుడికన్ను…

లక్ష్మణుడికి ఎడమ కన్ను అదిరింది అన్నట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక అంతే కాకుండా రావణాసురుడు యుద్ధానికి సిద్ధమయినప్పుడు శ్రీరాముడు లంకలో కి అడుగు పెట్టగానే రాముడి కి కుడికన్ను.. రావణుడికి ఎడమ కన్ను అదిరిందట.ఇలాంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని శకునాలను అంచనా వేయడం జరిగింది.అయితే ఇప్పుడు కన్ను అలా ఎందుకు అదురుతుంది మనం తెలుసుకుందాం. కనురెప్పల లోని ఉండే కండరాలు అసంకల్పితంగా సంకోచించినప్పుడు ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

According to the myths what happens if any eye is touched is science saying
According to the myths what happens if any eye is touched is science saying

1). కండరాల ఆకస్మిక సంకోచం వల్ల ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది.

2). మరొకసారి జన్యు సంబంధిత సమస్యల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.

3). కొంతమందికి ఏదైనా లోపం వల్ల సెకండ్లకు నిమిషాలకే కాదు కొన్నిసార్లు గంటల సేపు అలాగే ఉంటుంది.

కన్ను అదరడానికి గల ముఖ్య కారణాలు ఇవే..
1). ఎక్కువ మంది అధిక ఒత్తిడికి గురి కావడం వల్ల ఈ విధమైన సమస్య వస్తుందట.

2). ముఖ్యంగా మద్యం సేవించే వారికి కన్ను అదిరే లక్షణాలు ఎక్కువగా వస్తాయి.

3). ఎక్కువగా టీవీ, మొబైల్స్, ల్యాప్టాప్ చూసే వాళ్ళు ఈ ఒత్తిడికి గురవుతారు.

4). చాలామంది నిద్ర లేని సమస్య వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురవుతోంది.

అయితే మీ కన్ను పదే పదె అలా అదురుతూ వుంటే వాటిని.. నిర్లక్ష్యం చేయకుండా మీ దగ్గరలో ఉండే కంటి వైద్యులను సంప్రదించండి. అయితే వేటిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మడం మంచిది. ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి..

Virus-free. www.avast.com