SaturDay : శనివారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం రావడం ఖాయం..!!

SaturDay : ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శనివారం పూజలు చేస్తే ఉద్యోగం వస్తుందా అనే విషయాన్ని కొట్టిపారేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే మనం ఎంత బాగా చదువుకున్నా.. ఎంత మంచి స్కోరు చేసినా కూడా ఉద్యోగం రాలేదు అంటే అందుకు కారణం శని దేవుడు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. శనివారం అనేది శని దేవుడికి అంకితం చేయబడింది. శని దేవుడిని న్యాయదేవత, ధర్మదాత అని కూడా పిలుస్తుంటారు. అంతేకాదు

ఒక వ్యక్తికి సంబంధించి మంచి, చెడుపనులను శని దేవుడు పరిశీలిస్తాడు అని ప్రతీతి.ఇక కర్మానుసారం గా ఫలితాలను కూడా ఇస్తాడు అని శాస్త్రం చెబుతోంది. శని దేవుడి చెడు దృష్టి ఒక వ్యక్తిపై పడినట్లయితే వారి జీవితం చిన్నాభిన్నమై పోతుంది. ఇక ఇలాంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే శనివారం రోజున కొన్ని చర్యలు చేపడితే మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్య పండితులు కూడా చెబుతున్నారు. ఇక ఉద్యోగం వదులుకొని ప్రతి చిన్న విషయంలో కూడా అన్ని వైఫల్యాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో జ్యోతిషశాస్త్రంలో కొన్ని నివారణ మార్గాలు కూడా తెలపడం జరిగింది.

If you do this on Saturday you will definitely get a job
If you do this on Saturday you will definitely get a job

ముఖ్యంగా జాతకంలో శని ప్రభావం కొనసాగుతున్నట్లు అయితే ఉద్యోగం లో అనేక రకాల ఆటంకాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సమయంలోనే శనివారం రోజు నానబెట్టి న శనగలను ఉప్పు లేకుండా మసాలాలు జోడించకుండా ఆవనూనెలో ఉడికించాలి. వీటిని నల్ల ఆవు లేదా నల్ల కుక్క మరి ఏదైనా జంతువుకి తినిపిస్తే మంచి ఫలితం లభిస్తుంది. మూడు శనివారాలు వరకు ఇలా చేయాల్సి ఉంటుంది.

మరొక పరిహారం ఏమిటంటే శనివారం రోజు చీమలకు పిండి, చేపలకు పిండి మాత్రలు ఇవ్వడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. అంతేకాదు స్వీట్లు తినడం మాని వేసి కొన్ని శనివారాలు ఇలా పాటిస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది.

కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శనివారం సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత శని స్తోత్రాన్ని, శని చాలీసా చదవాలి. ఇలా మూడు శనివారాలు నిరంతరం చేయాలి.

శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవునేతి దీపం వెలిగించి శని మంత్రాన్ని 108 సార్లు జపిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇక తర్వాత రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఇలా 11 శనివారాలు చేయాలి.మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే శని ప్రభావం తో ఇబ్బంది పడుతున్నట్లు అయితే వారికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.