Friday : శుక్రవారం రోజు కష్టాలు తీరాలంటే ఇలా చేయాల్సిందే..?

Friday : శుక్రవారం రోజున మిగతా దేవుళ్ళ తో పోలిస్తే.. లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. మహాలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవాలని పేదవాడి నుంచి అత్యంత సంపన్నుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే తాంత్రిక శాస్త్రంలో కొన్ని సులభమైన మార్గాలు చెప్పబడ్డాయి. వాటిని కనుక తప్పకుండా మీరు పాటించినట్లయితే సంపదకు సంబంధించిన సమస్యలను తొలగిపోతాయి. ఇక పేదరికంతో బాధ పడేవారు.. ధనవంతులు కావాలని కోరుకోవాలి కాబట్టి.. ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ను వారికి ఉపయోగపడేలా వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి. ధనవంతులు కావాలని కోరిక ఉన్నవారు శుక్రవారం రోజున ఇలాంటి పనులు క్రమం తప్పకుండా పాటిస్తే మహాలక్ష్మి దేవి అనుగ్రహించి మీ కోరికలను తీరుస్తుంది.

ఇక శుక్రవారం రోజున ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే.. లక్ష్మీదేవి రెండు ముఖాలు ఉన్న దీపాన్ని వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. లక్ష్మీదేవికి తెల్లనిపువ్వులు అంటే ఎంతో ప్రీతికరం. ఇక శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజ గదిలో మల్లెపువ్వులతో , సుగంధ పరిమళాలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాధారణంగా తామరపువ్వుల లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున ప్రత్యేకంగా మల్లె పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

Do you have to do this on Friday to end the hardships
Do you have to do this on Friday to end the hardships

శుక్రవారం రోజున అమ్మవారికి ఉదయం , సాయంత్రం కర్పూరంతో ఎనిమిది రకాల నూనెలతో దీపం వెలిగించి పూజిస్తే ఆమె మనస్సు చల్లబడి ఆమె పూర్తి అనుగ్రహాన్ని మనపై ఉంచుతుంది. లక్ష్మీదేవి సువాసనతో కూడిన ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతుంది. కాబట్టి గంధాన్ని పూధించి అమ్మవారికి సమర్పిస్తే అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు శుక్రవారం రోజున మీరు బయటకు వెళ్ళేటప్పుడు సుగంధపరిమళాలు కలిగిన గంధపు నూనెలను ఉపయోగించడం వలన మీ పని అలాగే వ్యాపారంలో పురోగతిని చూడవచ్చు. ఇక శుక్రవారం రోజు ఆవులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి వేస్తే.. అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.ఇక శుక్రవారం రోజు చిన్న కొబ్బరికాయను పసుపు గుడ్డలో చుట్టి.. ఇంటి వంటగది తూర్పు వేలాడదీయడం వల్ల ఇంట్లో తిండికి, డబ్బుకు లోటు ఉండదు. ఇలాంటి మరి కొన్ని పద్ధతులను మీరు పాటించినట్లయితే ఇంట్లో శుభం కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది.