నిద్ర లేవగానే రెండు చేతులను రుద్ది కళ్ళకు ఎందుకు అడ్డుకుంటారో తెలుసా..?

పూర్వకాలంలో ఇంకా అభివృద్ధి చెందని రోజుల్లో మానవుడు ఎక్కువగా పురాణాలను నమ్మేవాడు.. ఇక మనుషులు ఎక్కువగా మునులు, ఋషులు చెప్పిన ఎన్నో ఆరోగ్య సూత్రాలను నమ్మడానికి ఆసక్తి చూపించేవారు. వైద్యరంగం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో శుచి, శుభ్రత, వ్యాధినిరోధకత వంటివి ఎక్కువగా దైవకార్యాల రూపంలోనే ఉండేవి. ఎందుకంటే ఆరోగ్య సూత్రాలను పుణ్యం, పురుషార్థం వస్తుందంటే చాలు సామాన్య ప్రజలు అనుసరిస్తారని అలా పెద్దవాళ్లు నియమాలను పెట్టడం జరిగింది.. ఇలా చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అని.. అలా చేస్తే అనారోగ్యం వస్తుంది అని ప్రజలను నమ్మిస్తూ ఉండేవారు.

అయితే ఇవన్నీ మూడ నమ్మకాలే అని కొంతమంది కొట్టిపారేసిన వారు కూడా ఉన్నారు. కానీ అలా చెప్పే వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని .. వాటిలో ఒకటి ఇప్పుడు చెప్పబోయే పద్ధతి కూడా.. ఇక పూర్వ కాలం నుంచి వస్తున్న పద్ధతి ఏమిటంటే ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే రెండు చేతులను రుద్ది.. కళ్ళకు అద్దుకోవాలి అని, ఆ తర్వాత ఇతరుల ముఖం చూడాలి అని చెబుతూ ఉంటారు. మన పండితులు ఎందుకు ఇలా చెప్పారు అంటే.. రెండు చేతులు రుద్దినప్పుడు చేతుల మధ్య రాపిడి కి ఉష్ణశక్తిని ఉత్పత్తి అయి.. అది కళ్ళకు తగలగానే కళ్ళలో రక్తప్రసరణ ఎక్కువగా జరిగి కళ్ళు ఆరోగ్యంగా.. తేజోవంతంగా ఉంటాయి.

Do you know why you rub both hands when you wake up and block your eyes
Do you know why you rub both hands when you wake up and block your eyes

ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు దరిచేరవు. ఒకవేళ ఉన్నా త్వరగా నయమవుతాయి అని పెద్దలు చెప్పే వాళ్ళు.. అంతే కాదు సైన్స్ కూడా ఇదే చెబుతుంది. ఇక ఇదే విషయంపై పెద్దలు ఏం చెప్పారు అంటే చేతులు రుద్దేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండా చూడడం ద్వారా బ్రాహ్మ ను పూజించినంత ఫలితం లభిస్తుంది అని, బ్రహ్మ జ్ఞానం మనకు కలుగుతుంది అని.. ఇక అలా ప్రతిరోజూ చేయడం వల్ల కోటి పుణ్య క్షేత్రాలు సందర్శించిన పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి అంటే ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.