Dream : మీ కలలో రామచిలుకలు కనిపించాయా.. అయితే ఆర్థిక సంపద పెరిగినట్టే.?

Dream : స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో కనిపించే కొన్ని వస్తువులు శుభ సంకేతానికి కారణమైతే మరికొన్ని శుభసూచకంగా కూడా పరిగణిస్తారు. ఇక పోతే మనకు వచ్చే కలలు మన భవిష్యత్తుకు ఏదో సంబంధం ఉందని ముందుగానే ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని పండితులు చెబుతుంటారు. ఇకపోతే కొన్నిసార్లు కలలో ఏం జరిగిందో లేచిన తర్వాత గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. మరికొన్నిసార్లు కలలో పక్షులు , జంతువులు, మనుషులు, లోయలు, ఎత్తైన శిఖరాలు లాంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి.

అలా ముఖ్యంగా కలలో కొన్ని రకాల పక్షులు కనిపించినట్లయితే ఆర్థిక నష్టం ఎదురవుతుంది అని హెచ్చరిస్తున్నారు. కానీ రామచిలుకలు కనుక మీ కలలో కనిపించినట్లైతే మీ పంట పండినట్టేనట.. ఇక ఇలా జరగడం వల్ల వ్యాపార రంగాలలో గుర్తింపు, ఆకస్మిక ధన లాభం, అధికమొత్తంలో లాభాలు , ఉద్యోగంలో ప్రమోషన్, చేపట్టిన పనులలో విజయం సాధించడం లాంటివి జరుగుతాయి అని ముఖ్యంగా కలలో రామచిలుకలు కనిపించడం శుభసూచకమని చాలామంది విశ్వసిస్తారు.ఇక అలాగే పిచ్చుకలు, గరుడ పక్షి, నెమలి, కొంగ వంటి పక్షులు కనిపించినా కూడా మంచి జరుగుతుందట.

Did the tortoises appear in your dream but the financial wealth increased
Did the tortoises appear in your dream but the financial wealth increased

ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారి కలలో ఈ పక్షులు కనిపిస్తే త్వరలోనే సమస్యలు తొలగిపోతున్నాయి అని సంపద వృద్ధి, వివాహం, సంతాన ప్రాప్తి కలుగుతాయని గుర్తించాలి. ఇక కలలోకి కనిపిస్తే మాత్రం దురదృష్టమని.. ఆర్థికంగా ఆరోగ్యపరంగా కష్టాలు తప్పవని.. ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉందని స్వప్న శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు చిన్న పిల్లలు కలలో కనిపించినా కూడా మనకు కలిసి వస్తుందట. స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది అని చెబుతారు ముఖ్యంగా పిల్లలు స్వచ్ఛతకు , అమాయకత్వానికి, మంచితనానికి మారుపేరు. కాబట్టి మీరు చిన్నపిల్లలు నవ్వుతున్నట్లు చూస్తే నిజంగానే సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.