Health Benefits : ఆప్రికాట్ తో ఈ రోగాలన్నీ పరార్.. ఎలా అంటారా..?

Health Benefits : చూడడానికి నారింజ మిఠాయిలా ఈ పండు కనిపించినా..నారింజ మిఠాయి అయితే కాదు.. దీని పేరు ఆప్రికాట్.. ఆప్రికాట్ పండుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కూడా దీని ప్రయోజనాలు మనకు బోలెడన్ని అందుతాయి. ఇందులో ఉండే ఎన్నో పోషకాలు మనకు లభిస్తాయి.. నిజానికి ఈ పండు తినడానికి చాలా తియ్యగా, మెత్తగా , జెల్లీ లాగా అనిపిస్తుంది. ఇక ఈ పండును తినడానికి చిన్న పిల్లలు సైతం ఆసక్తి చూపుతారు. మరి ఆప్రికాట్ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలియాలి అంటే ముందుగా ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

ఆప్రికాట్ లో లభించే పోషకాలు విషయానికి వేస్తే పొటాషియం , క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ,విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా దొరుకుతాయి. ఆప్రికాట్ లో మనకు ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే కాల్షియం, రాగి, ఇనుము, ఫాస్పరస్ , మాంగనీస్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉండుట వలన రెగ్యులర్ గా ఆప్రికాట్ తింటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి మరే ఇతర నొప్పులు వున్నా సరే వెంటనే ఉపశమనం కలుగుతుంది.ఆప్రికాట్ లో పొటాషియం సమృద్దిగా ఉండటం వల్ల గుండె కొట్టుకోవడంను రెగ్యులేట్ చేస్తుంది. అలాగే మజిల్ అభివృద్ధి కి కూడా సహాయపడుతుంది.

Health Benefits in apricot
Health Benefits in apricot

ఇక ఆప్రికాట్ లో మనకు విటమిన్ ఏ సమృద్ధిగా లభించడం వల్ల ఇది కంటి చూపు మెరుగుదలకు సహాయం చేస్తుంది.. ఆప్రికాట్ లో సెల్యులోజ్ అనేది కరగని ఫైబర్ కాబట్టి.. పెక్టిన్ సమృద్దిగా ఉన్నందు వలన శరీరంలో నీటి నిల్వలను బ్యాలెన్స్ చేయటం తో పాటు మలబద్దక సమస్యను కూడా తొలగిస్తుంది. ఇక ప్రతిరోజు క్రమం తప్పకుండా.. భోజనం చేయటానికి ముందు ఒక ఆప్రికాట్ తింటే జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఆప్రికాట్ లో ఉండే ఆల్కలైన్, న్యూట్రలైజ్ యాసిడ్స్ జీర్ణక్రియలో సహాయపడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ ఆప్రికాట్ ను మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి.