Tulsi Plant : తులసి మొక్క దగ్గర ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే డబ్బే డబ్బు..!!

Tulasi Plant : తులసి మొక్కకు ఎంత ప్రాధాన్యత వుందో తులసి ఆకులకు కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యత వుంది.. ఇక ఈ చెట్టు ఆకులను తొలగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ నియమాలను పాటించక పోతే అవి మనల్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. అయితే మనం తులసి ఆకులను కోసేటప్పుడు, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.అలాగే తులసి కోట దగ్గరా ఎలాంటి పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం.ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి మొక్క ను , మొక్క ఆకులను తొలగించ కూడదు. ఇక అంతే కాకుండా ఆదివారం రోజున,రాత్రి వేళలో తుంచరాదు, మరిముఖ్యంగా చంద్రగ్రహణం, సూర్య గ్రహణాల రోజున ఇలాంటి పనులు చేయకూడదు.

మనం ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తుంచడం వలన మనకు దక్కవలసిన ఫలితాలు దక్కలేదని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల ఆ ఇంటికి దురదృష్టం పడుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం పూట తులసి మొక్కకి నీరు కూడా పోయిరాదట.తులసి మొక్కకు ఉండేటువంటి ఆకులను చేతి గోళ్ళ తో ఎన్నడూ కత్తిరించకూడదట. తులసి మొక్కను బాగా ఎండ తగిలే చోట ఉంచాలి. చీకట్లో ఉంచరాదు. ప్రతిరోజు సాయంత్రం వేళల తులసి చెట్టు వద్ద దీపం పెడితే మంచి జరుగుతుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

If you take such precautions near the Tulsi Plant, you will earn a lot of money
If you take such precautions near the Tulsi Plant, you will earn a lot of money

తులసి ఆకులను అనవసరంగా తుంచకుండా ఆరోగ్యపరమైన అవసరాలకే వాడుకోవాలి. ఎవరైనా సరే స్నానం చేయకుండా తులసి మొక్క ని తాకరాదు.తులసి ఆకులు కోసిన వెంటనే తినడం వల్ల మన దంతాలకు హాని చేస్తాయట. అందుకోసమే వాటిని నీటిలో మరిగించి కొని తాగడం మంచిది. ఎండిపోయిన తులసి చెట్టు ను పక్కన పడేయకుండా, ఆ చెట్టుని ఆకులను ఆ తులసి చెట్టు ఉండే చోటనే మట్టిలోనే పూడ్చాలి. లేదంటే ఏదైనా బావిలోకి వేయాలి. ఇలా చేయడం మంచిదని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. తులసి మొక్కను ఆగ్నేయ మూల ఉంచరాదు. తులసి మొక్కను ఏదైనా కుండీలో నాటడం మంచిదట.