Bad Dreams : మిమ్మల్ని పీడ కలలు భయపెడుతున్నాయా ? ఇలా చేస్తే హ్యాపీ నిద్ర !

Bad Dreams : కలలు రావడం ప్రతి ఒక్కరికి సహజమే.. అయితే అందులో కొన్ని కళలు కొంతమందికి పీడకలుగా వస్తూ.. వారిని పగలు కూడా భయపెడుతూ ఉంటాయి. అయితే ఈ చెడు కలలు మన మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి. అందుకే ఈ చెడు కలలను దూరం చేసుకోవాలి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు ఫాలో అవ్వాలి. అయితే చెడు కలలను దూరం చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. నిజానికి చెడు కల అనేది మన దృష్టి పైన ఆధారపడి ఉంటుందని కొంతమంది నిపుణులు చెబుతూ ఉంటారు. వాటి గురించి ఆలోచిస్తూ రోజును పాడు చేసుకునేవారు కొంతమంది ఉంటే..

మరి కొంత మంది అది నిజమవుతుందని మరింతగా భయపడుతూ ఉంటారు. కొంతమంది కళ్ళు మూసుకుంటే చాలు ఆ కలే గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే పీడకలలను దూరం చేసుకోవచ్చు. చెడు కలలు రాకుండా ఉండాలి అంటే రాత్రి పడుకునే ముందు దిండు కింద లవంగాలను ఉంచండి.. లేదంటే ఫిట్కారి అనే ప్రసిద్ధి చెందిన స్పటిక ఉంచండి . ఇలా వారం రోజులు పాటు చేసిన తర్వాత దాన్ని కాల్చండి. అలాగే పడుకునే ముందు గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేయడం.. కుదిరితే స్నానం చేయడం వల్ల శరీరం తేలికపడి చెడు కలలు దూరం అవుతాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరొక నియమం విషయానికి వస్తే..

Are you suffering from bad dreams if you do like this will get happy sleep
Are you suffering from bad dreams if you do like this will get happy sleep

కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను పాదాలకు రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. దిండు కింద బియ్యం ప్యాకెట్ చిన్నది ఉంచినా సరే పీడకలలు దూరం అవుతాయి. లేదంటే మీ దిండు కింద ఇనుప కత్తిని పెట్టుకొని పడుకున్నా సరే ఇలాంటి కలలు దూరం అవుతాయి. అలాగే దిండు కింద నాలుగు ఏలకులను ఉంచుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు . చెడు కలలు రాకుండా ఉండాలి అంటే పడుకునే ముందు జుట్టు కట్టుకోవడం చాలా ముఖ్యం. అలాగే దక్షిణం వైపు తల.. ఉత్తరం వైపు పాదాలు పెట్టుకొని నిద్రించండి. మంచం కింద చెప్పులు వదిలిపెట్టకూడదు. ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి దానిని ఒక గుడ్డతో కప్పి మీ మంచం పక్కన ఉంచండి. ఈ నీటిని మరుసటి రోజు ఉదయం మొక్కలకు వేయండి ఇలా చేస్తే పీడకలలు దూరం అవుతాయి. హ్యాపీ గా నిద్ర పోవచ్చు.