Health Benefits : అవిసె ఆకు మన ఆరోగ్యానికి చేసే మేలు కచ్చితంగా తెలుసుకోవాలిసిందే !

Health Benefits : ప్రకృతిలో లభించే ప్రతి ఆకు కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే ప్రతి ఔషధాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ క్రమంలోనే అవిసె ఆకు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవిసె ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. అవిసె ఆకు చెట్టు 20 నుండి 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి ఎరుపు రంగు పూలు, తెలుపు రంగు పూలు పూస్తాయి.

ఈ చెట్లు సన్నగా ఎదగడం వల్ల వీటిని తమలపాకు తీగల సాగులో కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకులను ముద్దగా చేసి చర్మం మీద పట్టుగా ఉపయోగించడం వల్ల గాయాలు, దెబ్బలు ఇట్టే మానిపోతాయి.అవిసె ఆకుకు బాగా వేడి చేసే గుణం ఉంటుంది. నీరసాన్ని సమూలంగా నివారిస్తుంది. ముక్కులో ఈ ఆకుల రసం వేసుకోవడం వల్ల రొంప భారము, తలనొప్పి తగ్గిపోతాయి. అలాగే జలుబు కారణంగా నీరు బాగా కారి.. వచ్చే తలనొప్పి కోసం ఈ చిట్కా పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు ఈ ఆకు రసంలో కొద్దిగా తేనె కూడా కలిపి తాపిస్తే నులిపురుగులు అంతం చేయవచ్చు. అవిసె ఆకుల రుచి చేదుగా , కారంగా ఉంటుంది.

Definitely We must know the Health Benefits of flax leaf
Definitely We must know the Health Benefits of flax leaf

కడుపులో ఉన్న నులి పురుగులను అంతం చేయడానికి ఉపశమనం కలుగుతుంది. చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళల్లో వచ్చే గవద బిళ్ళలకు అవిసె ఆకుల రసం పోస్తే త్వరగా కరిగిపోతాయి. రే చీకటి ఉన్నవారు అవిసె ఆకులను కర్ర రోటిలో కర్రబండ సహాయంతో మెత్తగా దంచి.. ఆ మిశ్రమాన్ని కొండ లో పోసి ఉడకబెట్టాలి. అందులో నుంచి రసాన్ని తీసి సేవిస్తే రేచీకటి తగ్గిపోతుంది. అవిసె ఆకులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో కంటే తమిళనాడు ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని కూరగా తినడమే కాకుండా అవిసె ఆకులతో తయారుచేసిన కూరను ఆవులకు కూడా తినిపిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ అవిసె ఆకులు కలిగిస్తాయి.