Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుతో ఇలా చేశారంటే సంపద పెరుగుతుందట..!!

Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి విషయాన్ని కూడా మనం ఆచితూచి జాగ్రత్తగా తెలుసుకొని పాటించాల్సి ఉంటుంది.. ఇకపోతే ఇంట్లో ప్రతి ఒకరు చేసే వంటకాలలో ఉప్పు జోడించనిదే ఆ వంటకానికి రుచి రాదు. అందుకే ప్రతి వంటలలో కూడా ఉప్పును ఉపయోగిస్తారు. ఇక ఉప్పుకు కేవలం రుచిని మాత్రమే కాదు అదృష్టాన్ని మార్చే గుణం కూడా కలిగి ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు తో చేసే అనేక నివారణలు మనకు కలుగజేస్తాయి. అంతేకాదు ఉప్పు అనేది మన జీవితం పై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఎప్పుడు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది . ముఖ్యంగా ఇంట్లో ఆనందం , శ్రేయస్సును పెంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఉప్పు కారణంగా ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అంటే వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఏ లోహపు పాత్రలలో కూడా ఉంచకూడదు. ముఖ్యంగా ఉప్పును ఎల్లప్పుడు గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో శాంతి , ఆనందం రెండూ నెలకొంటాయి. ఇక ఇంట్లో డబ్బు కు ఎటువంటి కొరత కూడా ఉండదు. వాస్తుశాస్త్రంలో నివారణోపాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతికూల శక్తి దూరంగా ఉండాలి అంటే మీరు ఉపయోగించే బాత్రూం లో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు వేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు మీ ఇంటికి దూరంగా ఉంటాయి.

According to Vastu Shastra, doing this with salt is wealth
According to Vastu Shastra, doing this with salt is wealth

ఇక ఇంటి అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి.ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే సమర్థవంతమైన నివారణ చిట్కా అని చెప్పవచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు చెంచాల నువ్వుల నూనె.. నాలుగు లవంగాలు ఆ గిన్నెలో వేసి ఎవరికీ కనిపించని మూలలో ఆ గాజు గిన్నె ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనప్రాప్తి పెరుగుతుంది. అంతేకాదు ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుంది. స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి , స్నానం చేయడం వల్ల ఒత్తిడి , అలసట తగ్గి పోయి ఆ వ్యక్తిలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి.