Akshaya Tritiya 2022 : అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే డబ్బే డబ్బు..!!

Akshaya Tritiya 2022 : వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మూడవ రోజును అక్షయ తృతీయ గా పిలుస్తారు. ఈ అక్షయ తృతీయ రోజున కొద్దిగా జపం చేసినా.. ధ్యానం చేసినా.. పారాయణం చేసినా సరే అనంతమైన.. అక్షయమైన.. దివ్యమైన ఫలితాలను పొందవచ్చు. అందుకే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు కూడా వచ్చింది. మరి అక్షయ తృతీయ రోజు పూజా విధానం అలాగే దానం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..అక్షయ తృతీయ రోజు మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి అలాగే లక్ష్మీ నరసింహ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు.

ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవిని అలంకరించి ప్రమిదలో ఆరు వత్తులు వేసి.. ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. అంతే కాదు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే చక్కగా అమ్మవారికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి. పూజ లో ఏర్పాటుచేసిన అక్షింతలు తలమీద వేసుకొంటూ ” ఓం కమల వాసినేయే నమః” అనే ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుతూ లక్ష్మీదేవిని గులాబీలతో అర్చన చేయాలి ఇలా చేస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుంది.గులాబీలు లక్ష్మీ నరసింహ స్వామి కి కూడా చాలా ఇష్టమైనవి. కాబట్టి సింహాచలంలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.

Doing this on the third day of Akshaya Tritiya is a lot of money
Doing this on the third day of Akshaya Tritiya is a lot of money

సింహాచలం లో సాయంత్రం వేళ లక్ష్మీ నరసింహ స్వామికి చందనోత్సవం జరుగుతుంది. లక్ష్మీ నరసింహ స్వామికి చందనం బొట్టు పెడితే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారికి సమస్యలు తొలగిపోతాయట. స్వామివారికి నువ్వుల నూనె ను ప్రమిద లో వేసి 9 వత్తులతో దీపం వెలిగించడం వల్ల స్వామి వారు ప్రసన్నమవుతాడు అట. అలాగే పానకం , వడపప్పు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని 21సార్లు చదివినట్లయితే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అలాగే లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం మనకు కలిగి సంపద వృద్ధి చెందుతుంది . ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.