Numerology : న్యూమరాలజీ ప్రకారం ఈ రాశుల వారికి ధన ప్రాప్తి..!!

Numerology : హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యోతిషశాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో న్యూమరాలజీకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ చాలామంది ధనవంతులు కూడా న్యూమరాలజీ ప్రకారం తమ పేరున మార్చుకుని సంపన్నులు గా చలామణి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక న్యూమరాలజీ ప్రకారం కొన్ని నంబర్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడమే కాకుండా వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏ నంబరు వారు అదృష్టవంతులు గా మారుతున్నారు.. వారికి ఏ విధంగా బాగా కలిసి వస్తుంది అనే విషయాలను కూడా ఒకసారి తెలుసుకుందాం.

According to Numerology these people have access to money 
According to Numerology these people have access to money

నంబర్ 1 : న్యూమరాలజీ ప్రకారం 1,12,19, 28 తేదీలలో జన్మించిన వారు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటవ తారీఖు లోకి వస్తారు. వీరు అనుకూల పరిస్థితులను పొందుతారు. ముఖ్యంగా భూములు కొనుగోలు చేయడం లేదా అమ్మడం లాంటివి ఈ రోజు మానుకోవడం మంచిది. లక్కీ నెంబర్ 3. ఇతరులకు దానం చేస్తూ .. భగవంతుని స్మరణ చేసుకోవడం వల్ల అంతా శుభమే కలుగుతుంది.

నంబర్ 2 : నెలలో 2, 11 , 20, 29 తేదీలలో జన్మించిన వారి సంఖ్య 2. మీరు ఈ రోజు ఈ నెంబర్ కలిగిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది . ఎందుకంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పటికీ భాగస్వామి విషయంలో గొడవలు అవుతాయి. చట్టపరమైన సమస్యలు మీ ప్రమేయం లేకుండానే రాజీపడకుండా నే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈరోజు సీనియర్ల విమర్శలను ఆడవారు అసలు పట్టించుకోకూడదు. ఇక వీరి లక్కీ నెంబర్ 2

నంబర్ 3 : నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారి నెంబర్ 3. ఈరోజు రచయితలకు సంగీత కళాకారులకు మంచి రోజు. కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. వీరికి కలిసి రావడమే కాదు ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక పెట్టిన పెట్టుబడులకు నిదానంగా డబ్బు కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3,1.