Maulana Abul Kalam Azad : చరిత్ర నిజాలు భారతదేశాన్ని మతప్రాతిపదికన విడదీయడాన్ని భరించలేక పోయిన అబుల్ కలాం ఆజాద్ గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

Maulana Abul Kalam Azad : ఆజాద్ జననం : మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 వ సంవత్సరం నవంబరు 11 వ తేదీన,మక్కానగరంలోజన్మించారు. ఆయన వంశస్థులు బాబర్ రోజుల్లో హేరాత్ అని ఆఫ్ఘనిస్తాన్ లో ఒక నగరం కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానాల వంశం నుండి వచ్చినవారు. అతని తల్లి ఒక అరబ్, ఆమె పేరు షేక్ మహ్మద్ జహీర్ వత్రి, ఆయన తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా కు చేరుకొని అక్కడే స్థిరపడడం జరిగింది. అయన తన కుటుంబంతో 1890 వ సంవత్సరం లోకలకత్తా వెళ్లారు.

Maulana Abul Kalam Azad : ఆజాద్ విద్య :

ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య ను అభ్యసించారు. ఆయన విద్య అంతా కూడా ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, ఆ తర్వాత ఉపాధ్యాయులు ఇంట్లోనే చదువు చెప్పేవారు. ఆజాద్ మొదట అరబిక్, పెర్షియన్ భాషలు నేర్చుకున్నాడు. ఆ తరువాత రేఖాగణితం, తత్వశాస్త్రం,గణితం, బీజగణితం అభ్యసించారు. తానే స్వయంగా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు చదివి తెలుసుకున్నాడు.ఆజాద్ మౌలానా అవడానికి కావలసిన మత శిక్షణను పొందాడు.అతను దివ్య ఖురాన్ మీద భాష్యం రాయడం కూడా జరిగింది.

Maulana Abul Kalam Azad : స్వాతంత్ర్యం కోసం :

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయుడిగా, స్వతంత్రం తర్వాత భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాల కోసం కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన మహా మనిషి మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్.

Maulana Abul Kalam Azad : మతమౌఢ్యానికి చిక్కబడలేదు

సౌదీ అరేబియా దేశంలోని మక్కా లో భారతీయ వ్యక్తి, అరబ్ యువతిల సంతానంగా మౌలానా అబుల్ కలామ్‌ పుట్టినప్పటికీ ,మహమ్మదీయ సాంప్రదాయ పద్దతిలో విద్యాభ్యాసం జరిగినప్పటికీ, మౌలానా రహస్యంగా ఆంగ్లం కూడా నేర్చుకోవడం జరిగింది. ఇస్లామిక్ సాంప్రదాయ పద్దతిలో పెరిగినా , విద్యాభ్యాసం చేసినా మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ ఏనాడూ మతమౌఢ్యానికి చిక్కబడలేదు. ఇది ఒక్కటే కాదు మతప్రాతిపదికన భారతదేశాన్ని విడదీయాలన్న జిన్నా వంటి ప్రముఖులతో కూడా విభేదించారు. ముస్లింలీగ్ పార్టీ మొత్తం ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహిస్తోందన్న అపవాదును పోగొట్టడానికి మౌలానా ‘నేషనలిస్ట్ ముస్లిం లీగ్ పార్టీని కాంగ్రెస్‌లో అంతర్భాగంగా స్థాపించడం జరిగింది. స్వాతంత్ర్యం కోసం మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ వంటి ఎందరో నాయకులు చేసిన గొప్ప కృషి గాంధీ, నెహ్రూ లాంటి ప్రజాకర్షక నేతల మధ్య మరుగున పడిపోయింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Maulana Abul Kalam Azad : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌

స్వతంత్రం తర్వాత భారతదేశంలో నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా 10 సంవత్సరాల పాటు తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన మౌలానా ఆజాద్ గారిని నెహ్రూ సంస్కృతి, ధైర్యాలకు ప్రతీక గా కీర్తించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌’ ని స్థాపించింది మౌలానా ఆజాద్‌గారే . సాంకేతిక విద్యకు ప్రోత్సాహకంగా ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌’ ను కూడా స్ధాపించారు. సైకలాజికల్ స్టడీస్‌పై విద్యార్ధులకు ఆసక్తిని పెంచడం కోసం మౌలానాగారు కృషి చేశారు.

Maulana Abul Kalam Azad : తన నివాసంలోనే కొంత భాగాన్ని

అటు విద్యారంగంలో శాస్త్ర, సాంకేతిక, స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేస్తూనే, కళారంగంలోతనకు ఉన్న ఆసక్తిని కూడా ప్రదర్శించారు మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌ . సంగీత, సాహిత్యాలను అమితంగా అభిమానించే మౌలానా లలిత కళా అకాడమీ’సాహిత్య అకాడమీ’, సంగీత నాటిక అకాడమీ, ను స్ధాపించినపుడు దానికి భవనం లేకపోవటంతో తన నివాసంలోనే కొంత భాగాన్ని దానికోసం ఇచ్చేసారు. విద్యా, సాహిత్య రంగాల్లో అభివృద్ధికి గొప్ప కృషి చేసిన మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ను పలు సాంస్కృతిక సంస్ధలు తగురీతిగా ఆయన్ను సన్మానించాయి. ఇస్లాంను పరిపూర్ణంగా నమ్మి, ఆచరించిన మౌలానా ఆజాద్ మతపరమైన జీవన విధానానికి ఉదాహరణగా నిలువదగిన వ్యక్తి గా చెప్పబడ్డారు.

Maulana Abul Kalam Azad : ‘ఇండియా విన్స్ ఫ్రీ డమ్ ‘

భారతదేశాన్ని మతప్రాతిపదికన విడదీయడాన్ని భరించలేకపోయారు. మౌలానా అబుల్‌ కలామ్‌ రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీ డమ్ ‘ అనే పుస్తకంలో భారతదేశ విభజనకు గురికావడానికి కాంగ్రెస్‌ వారితో పాటు మహమ్మద్ అలీ జిన్నాను కూడా కలిపి సమానంగా నిందిస్తూ, బాధ్యులను చేస్తారు. అటువంటి మౌలానా తన జీవితాన్ని ఆదర్శవంతంగా గడిపి,అందరికి ఆదర్శ ప్రాయం గా నిలిచారు అనడం లో సందేహమే లేదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం గులాం ముహియుద్దిన్ గా చెప్పబడింది.ఆయనని అందరు ఆప్యాయంగా మౌలానా ఆజాద్ అని పిలచుకునేవారు.

స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో:

భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. ఆయన ప్రఖ్యాత పండితుడు మరియు కవి కూడా .

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ,అరబిక్, ఇంగ్లీష్, హిందీ,పెర్షియన్ ,బెంగాలీ వంటి అనేక భాషలలో ప్రావిణ్యుడుగా గుర్తింపు పొందారు. ఆయన పేరు కు తగ్గట్టు, వాదనలో రారాజు ,వాదనా పటిమలో మేటి. ఆయన తన కలం పేరు ఆజాద్ గా స్వీకరించినారు.ఆయన జమాలుద్దిన్ ఆఫ్ఘానీ యొక్క పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలను, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలో ఆసక్తి ని కూడా కలిగి ఉన్నారు. పాన్-ఇస్లామిక్ భావాలతో ఆయన ఇరాక్,ఆఫ్గనిస్తాన్, ఈజిప్ట్, సిరియా మరియు టర్కీ లను తిరిగి వచ్చారు.

జాతీయవాద విప్లవవాది గా:

ఇరాక్ లో ఆయన ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటo చేస్తూ నిర్వాసిత విప్లవ కారులను కలుసుకోవడం జరిగింది. ఈజిప్ట్ లో ఆయన షేక్ ముహమ్మద్ అబ్దుహ్ , సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కూడా కలుసుకున్నారు. ఆయన కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకోవడం జరిగింది. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాది గా మార్చగలిగాయి.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు:

విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేప్పట్టడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు కూడా ఏర్పాటుచేసారు. ఆసమయం లో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు దానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగించుకుంటుంది అని భావించారు. ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ఎన్నోవిధాల ప్రయత్నించేవారు.

అల్ హిలాల్’ వార పత్రిక:

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1912 వ సంవత్సరం లోఉర్దూ లో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింలు మధ్య విప్లవాత్మక భావాలను పెంచడం కోసం స్థాపించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల పలితంగా రెండు గ్రూప్ ల మధ్య వచ్చిన గొడవల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటం లో ప్రముఖ పాత్ర పోషించగలిగింది. అల్ హిలాల్ అతివాద భావనల విప్లవాత్మక ధ్వనిగా ఉండేది . ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచార కర్త గా అల్- హిలాల్ ను ప్రభుత్వంభావించి దానిని 1914 వ సంవత్సరం లో నిషేదిoచడం జరిగింది.

విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను అల్ బలఘ్:

అప్పుడు ఆజాద్ భారతీయ జాతీయ వాదం , హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను అల్ బలఘ్ ను మొదలు పెట్టారు .1916 వ సంవత్సరం లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా తో పాటు రాంచి లో ఆపివేయడం తో పాటు ఆజాద్ ను నిర్భందించడం జరిగింది. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920వ సంవత్సరం తర్వాత ఆయన్ను విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీ లో బ్రిటిష్ వ్యతిరేక భావాలు బాగా తీసుకురాగలిగారు. ఖలీఫా ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం ఖలీఫాను మళ్ళి టర్కీ రాజుగా చేయడం మాత్రమే అని చెప్పబడింది.

ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా :

మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీ మొదలు పెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం కు తన మద్దతు తెలుపుతూ 1920 వ సంవత్సరం లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఆయన ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా కూడా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ అధ్యక్షునిగా:

మౌలానా ఆజాద్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 1930 వ సంవత్సరం లో అరెస్టు చేసి ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో వేశారు. అబుల్ కలాం ఆజాద్ 1940 వ సంవత్సరం లో రాంగడ్ లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై న తర్వాత 1946 వ సంవత్సరం వరకు ఆ పదవి లోనే ఉన్నారు.

విభజన కు వ్యతిరేకి:

ఆయన విభజన కు వ్యతిరేకి. విభజన ఆయన కలలను నాశనం చేసింది. హిందువులు , ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు కావడం ఆయన కల ను నాశనం చేసి ఆయన్ను విపరీతంగా బాధించింది.

మొదటి విద్యాశాఖ మంత్రి:

మన స్వతంత్ర భారతదేశం లో మొదటి విద్యాశాఖ మంత్రి గా 1947వ సంవత్సరం నుండి 1958వ సంవత్సరం వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఆయన సేవలందించారు.

అబుల్ కలాం మరణం :

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1958 వ సంవత్సరం ఫిబ్రవరి 22, న స్ట్రోక్ తో మరణించడం జరిగింది.మరణానంతరం అబుల్ కలాం ఆజాద్ కి 1992 వ సంవత్సరం లో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారo అయిన భారతరత్న లభించింది.

అబుల్ కలాం ఆజాద్ గురించి కొన్ని ముఖ్య విషయాలు:

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పనిచేసారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబరు 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం . స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పని చేసారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొదటి 5 సంవత్సరాలలోనే ICCR,UGC, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో సాంకేతిక విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేశారు. దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషి చేయడం తో పాటు ,దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు కూడా వేశారుభారత విద్యారంగాన్ని పరిపుష్టం చేయడం తో పాటు విద్యావిధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి దారులు వేసిన మహానుభావుడు అబుల్ కలాం ఆజాద్.