Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఈ పేరు తెలియని వారుండరు.. ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100.. ఈ సినిమాతో అమ్మడు కాస్త ఘాటుగానే కనిపించింది.. అందాలను అలవోకగా ఆరబోసి.. మొదటి సినిమా తోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది..
ఆ తరువాత పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకుంటారు. కానీ అందుకు రివర్స్ జరిగింది.. మొదటి సినిమా లో తన బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో చితక్కొట్టింది. దర్శకుడు అంత గొప్పగా హీరో హీరోయిన్స్‌తో పర్ఫార్మెన్స్ చేయించాడు.
ఆ తర్వాత పాయల్‌కి వచ్చిన అవకాశాలు మామూలుగా లేవు. తను సుమారు వందకు పైగా కథలు విన్నా అందులో మంచి కథ, కథనం పాయల్‌కి కనిపించలేదు. దీనికి తోడు కథ చెప్పే ముందు ఇన్ని ముద్దులుంటాయి. ఇన్ని రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఇలాంటి కాస్ట్యూంస్ వేసుకోవాలి. ఇలా స్కిన్ షో చేయాలి అని చెప్పారు.
ఆ సోది మొత్తం విన్న తర్వాత సరే కథ అయినా బావుంటుందీ అనుకుంటే కథ నీచాతి నీచం. అందుకే సున్నితంగా అన్నీ కథలను తిరస్కరించింది. ఇక మన ఇండస్ట్రీలో సినిమా అవకాశం ఇచ్చేవారికంటే కూడా అవకాశం ఇస్తామని వాడుకునే వర్గమే ఎక్కువగా ఉంటుంది. అలాంటి అనుభవాలు పాపం పాయల్ కెరీర్‌లో ఉన్నాయి. సినిమా ఇస్తారని నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా బోలెడున్నాయి. అందుకే పాయాల్ కెరీర్ లో అలోంచించి ముందుకు అడుగేస్తుంది.