Woman: అమ్మాయిలని అబ్బాయిలు .. పొరపాటున కూడా అడగకూడదని ప్రశ్నలు !

Woman: సాధారణంగా మనం ఎవరినన్న కలిసినప్పుడో.. మనకు ఎవరైనా కనిపించినపుడో.. మాట్లాడుకోవడం సహజమే. ఆ సమయంలో కుశల ప్రశ్నలు వేస్తుంటారు.. అయితే మీరు అమ్మాయిల తో మాట్లాడేటప్పుడు ఈ ప్రశ్నలు అడగకూడదట.. ముఖ్యంగా పెళ్ళికాని , పెళ్ళైనా వారిని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Married And UNmarried Woman why should not ask these questions
Married And UNmarried Woman why should not ask these questions

మన స్నేహితులు బంధువులు కలిసినప్పుడు లేదంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ అబ్బాయి అయినా కూడా ఏ అమ్మాయిని నీ పెళ్లి ఎప్పుడు అని నేరుగా అడగకూడదు. ఎందుకంటే పెళ్లి అనేది ఆ అమ్మాయి వ్యక్తిగత విషయం. కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బంది కూడా పడవచ్చు. వాళ్ళకి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అనేది చిన్న విషయం కాదు కాబట్టి, వాళ్ల జీవితంలో వారు తీసుకునే అతి పెద్ద నిర్ణయం. అది కూడా వాళ్ల ఇష్టమే. ఆ ప్రశ్న అడగటం కూడా ఒక రకంగా వ్యక్తిగతంగా బాధపెట్టినట్టే అవుతుంది.

అదేవిధంగా పెళ్లి అయిన అమ్మాయి కనిపించగానే పిల్లలు ఎప్పుడు అని ప్రశ్నించకూడదు.. ఆ విషయం పూర్తిగా భార్యభర్తల వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ఇద్దరి మనసులు చిన్న బుచ్చుకుంటాయని గమనించాలి. పిల్లలు అనేది ఓ పెద్ద బాధ్యత వారి ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా వారు పిల్లల్ని ప్లాన్ చేసుకొని ఉండవచ్చు.. లేదంటే వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.. ఆ విషయం మనతో తీరుబడిగా చెప్పలేరు కాబట్టి.. పెళ్లి అయిన అమ్మాయిలని ఇంకా పిల్లలు లేరా అని అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఆ ప్రశ్న కొందరికి ఇబ్బంది అనిపిస్తే, మరికొందరికి బాధను కలుగచేస్తుంది.

ఇదే ప్రశ్నలపై కోరలో చర్చ జరుగగా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. పెళ్లి , ఆ తరువాత పిల్లలని కనడం అనేది పూర్తిగా ఆ అమ్మాయిల వ్యక్తిగత విషయమని.‌. విలైనంతవరకు అలాంటి ప్రశ్నలను ఆడగకుండా ఉండడమే మంచిది అని ఎక్కువమంది వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు.