Samantha: ‘ ఆ పని ‘ ఇమ్మీడియట్ గా ఆపకపోతే .. సమంత జీవితం సర్వ నాశనం గ్యారెంటీ !

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరియర్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.. ఇటీవల తను మయోసైటీస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో పాల్గొంది.. అయితే సమంత తన అనారోగ్యంతో కాకుండా ఇలా చేసి తన కెరీర్ ని స్పాయిల్ చేసుకుంటుందనీ..
ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది..

Samantha doing these activities her career will spoil
Samantha doing these activities her career will spoil

సమంత ఇన్వాల్వ్మెంట్ తన సినిమాలలో ఈ మధ్య బాగా ఎక్కువ అయిందని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. సమంతకి ఏ డైరెక్టర్ అయినా కథ చెప్పినప్పటి నుంచి ఆ సినిమా ఎడిటింగ్ అయ్యేవరకు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందట.. సమంత ప్రతి చిన్న విషయంలో కూడా తన్నే కలగజేసుకుంటుంది అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఇప్పటినుంచి కాదు సమంత నటించిన యూటర్న్ సినిమా నుంచి విడుదలైన యశోద వరకు ఇదే తీరు కొనసాగిస్తుందని.. కొందరు డైరెక్టర్స్ చెప్పుకుంటున్న మాటలు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

సమంత ఇటీవల నటించిన యశోద సినిమా డైరెక్టర్ చెప్పినట్లుగా చేసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేదని.. సమంత ఇన్వాల్వ్మెంట్ వలనే ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిందని.. ఓ టాక్ ఎప్పటినుంచో గట్టిగా వినిపిస్తుంది.. సమంతకి నచ్చకపోతే కథలో ముఖ్యమైన సన్నివేశాలను కూడా మార్పిస్తుందట. ఇటీవల వచ్చిన యశోద సినిమా విషయంలో సమంత ఎక్కువగా కలగచేసుకుందట. దర్శకులిద్దరికీ పెద్దగా ఫ్రీడం ఇవ్వలేదని సినిమాలో తన పాత్ర మాత్రమే ఎక్కువగా హైలెట్ అవ్వాలని.. సమంత పట్టుబట్టి ఎడిటింగ్ రూమ్లో చాలా సీన్స్ మార్చేసిందట..

అందుకే దర్శకులు అనుకున్న సక్సెస్ దక్కలేదని టాక్ ఉంది. ఇదే విషయం సమంత ఇక మీద కూడా కంటిన్యూ చేస్తే.. తను సక్సెస్ చూడడం కష్టమే అంటున్నారు మేకర్స్. సమంత ఈ తీరు మార్చుకోవాలని మార్చుకోకపోతే తన కెరియర్ చిక్కుల్లో పడ్డట్టేనని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత ఎప్పటికీ అలాంటి తీరు ప్రదర్శించదని కొట్టిపారేస్తున్నారు.