Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఇప్పటికీ కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. సూపర్ స్టార్ గా తెలుగు సినిమాకు కృష్ణ చేసిన సేవ చరిత్రలో నిలిచిపోతుంది. సుమారు 360కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ఈనెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మహేష్ కుటుంబంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమంలో ఒక సగం ముగిసింది.. కృష్ణ చనిపోయిన తర్వాత మహేష్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ రాశారు. అది చూసిన త్రివిక్రమ్ మహేష్ బాబుకు ఓ సలహా ఇచ్చారట..

నాన్న నీ జీవితం ఒక వేడుకగా గడిచిపోయింది. నీ నిష్క్రమణం కూడా అంతే వేడుకగా సాగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ స్వభావం మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రసరిస్తూనే ఉంటుంది. విచిత్రం ఏమిటంటే నేను ఇంతకుముందున్నడూ లేని శక్తిని నాలో అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను. అచ్చం మీలాగే మీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాను. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యు నాన్న.. మై సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు మహేష్. ఈ ట్వీట్ చూసిన తరువాత త్రివిక్రమ్ మహేష్ కు ఓ సలహా ఇచ్చారట.. మహేష్ కృష్ణ గారు భౌతికంగా నీ నుంచి దూరమైనా ఆయన ఎప్పుడూ నీ వెంటే నీ నీడ లాగా ఉంటారు. నీకు కష్టం కలిగినప్పుడు ఒక్కసారి ఆయనని గుర్తు చేసుకో నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని మనోధైర్యాన్ని అందించారట.
అంతే కాకుండా ప్రయోగాలకు పెట్టింది పేరు కృష్ణ. అలాగే ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. ఇకనుంచి నువ్వు కూడా ప్రయోగాల బాట పట్టాలి. నువ్వు చేసే ప్రయోగం విజయవంతం అయితే నీ పేరు కూడా ఇలాగే చిరస్థాయిగా నిలిచిపోతుంది. కృష్ణ గారు ఎప్పుడు ప్రయోగాలు చేయడంలో వెనకడుగు వేయలేదు. ఆయన ప్రయోగాలే ఎంతోమందికి దారి చూపాయి. నువ్వు కూడా అలాంటి బాటనే భవిష్యత్తు తరాలకు వేయాలని ఆశిస్తున్నాను అని త్రివిక్రమ్ చెప్పారట. ఇకనుంచి నా సినిమాలలో కొత్తదనం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అని మహేష్ స్పందించారట.