Prabhas : ఒకే ఒక్క కారణం తో .. రాజమౌళి మీద రగిలిపోతోన్న ప్రభాస్ !

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఈ సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే రాజ‌మౌళి- ప్ర‌భాస్ మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మ‌రి ఒక్క కార‌ణం వ‌ల్ల‌నే రాజ‌మౌళిపై ప్ర‌భాస్ ర‌గిలిపోతున్నాడు. అందుకు గ‌ల కార‌ణం ఏంటో ఈ స్టోరీ చ‌దివితే తెలుస్తుంది. జ‌క్క‌న్న త‌న సినిమాల‌ని జపాన్‌లో విడుద‌ల చేస్తూ అక్క‌డ కూడా మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్నాడు. ‘బాహుబలి 2’సినిమాని భారీ స్థాయిలో జ‌పాన్‌లో విడుద‌ల చేయ‌గా, ఈ సినిమాతో ప్రభాస్, రానా, రాజమౌళి పేర్లు జపాన్‌లో మారుమోగిపోయాయి.

prabhas-fire-on-rajamouli
prabhas-fire-on-rajamouli

ఊగిపోతున్న ప్ర‌భాస్..

ఈ క్ర‌మంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాని కూడా జపాన్‌లో విడుద‌ల చేశారు. అయితే ‘బాహుబలి 2’ను మించి RRRను ఇరగబడి చూసేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా.. జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో అత్యధికంగా వసూలు చేసిన రెండో ఇండియన్ చిత్రంగా నిల‌వ‌డం విశేషం.. ‘బాహుబలి 2’ బాక్సాఫీసు కలెక్షన్‌ను ఆర్ఆర్ఆర్ బీట్ చేసింది. జపాన్ వ్యాప్తంగా 209 స్క్రీన్స్, 31 ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా.. అక్కడ అత్యంత వేగంగా 300 మిలియన్ జపనీస్ యెన్‌లు వసూలు చేసిన చిత్రంగా స‌రికొత్త రికార్డ్ సృష్టించింది.

విడుదలైన 34 రోజుల్లో 305 మిలియన్ జపనీస్ యెన్‌లు రాబ‌ట్ట‌గా, ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే రూ.17.9 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇక 34 రోజుల్లో 2,03,867 మంది ఆర్ఆర్ఆర్ సినిమాని చూశారు. అయితే ఇన్నాళ్లు జ‌పాన్‌లో త‌ను న‌టించిన బాహుబ‌లి2పై ప్ర‌త్యేక రికార్డ్ ఉండ‌గా, ఇప్పుడు దానిని ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్రేక్ చేయ‌డం వ‌ల్ల‌న ప్ర‌భాస్.. రాజమౌళిపై గుర్రుగా ఉన్నాడ‌ట‌. త్వ‌ర‌లో వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో బాహుబ‌లి 3 రూపొంద‌నుండ‌గా, ఈ సినిమా చేయాలా వ‌ద్దా అనే ఆలోచ‌న‌లో ప్ర‌భాస్ ఉన్న‌ట్టు తెలుస్తుంది.