Singer Sunitha : కంట్లో నీళ్ళతో సింగర్ సునీత .. తట్టుకోలేకపోతోన్న ఫ్యాన్స్ ! 

Singer Sunitha : ఎప్పుడు తన గానామృతంతో ప్రేక్షకులను అలరించే సింగర్ సునీత తన మోముతో చందమామ లాంటి చిరునవ్వుతో ఎంతటి కోపోద్రిక్తులైన సరే శాంతింప చేసి వారి మోముపై చిరునవ్వు కనిపించేలా చేస్తూ ఉంటుంది. అలాంటి సునీత కంట్లో నీళ్లు తిరగడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

Singer Sunitha cover with tears in her eyes.. fans also get emotional..!
Singer Sunitha cover with tears in her eyes.. fans also get emotional..!

టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సునీతకి ప్రేక్షకులలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్న సింగర్ సునీత పాడిన పాటలు ఊహించని స్థాయిలో హిట్ అవుతూ వచ్చాయి. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా సునీతకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగులోని ప్రముఖ హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పి.. వారిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించిన సునీత అదే రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఎప్పుడు వివాదాలకు పోకుండా ఏ సమస్య వచ్చినా సమన్వయంతో సాల్వ్ చేసుకునే సునీత అంటే ప్రతి ఒక్కరికి ఎనలేని గౌరవం.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల కోరిక మేరకు లైవ్ లో పాటలు పాడి వినిపించిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఈ క్రమంలోనే సింగర్ సునీత ఎమోషనల్ అవడం చూసి అందరూ మరింత భావోద్వేగానికి గురి అవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే సునీత కూతురు శ్రేయ పుట్టినరోజు కావడంతో కూతురితో కలిసి దిగిన ఫోటోలను కొన్నిటిని షేర్ చేస్తూ.. ఒక పోస్టుని సునీత షేర్ చేసింది . ఆ పోస్టులో సునీత తన “కూతురు బర్తడే సూపర్ డూపర్ బర్తడే అని.. తన కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని” చెప్పుకోచ్చారు. “ఇంత మంచి కూతురుకి తాను తల్లిని అయినందుకు గర్వపడుతున్నాను” అంటూ ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం కూతురు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో ఈ ఫోటోలను పంచుకోగా ఇవి బాగా వైరల్ గా మారుతున్నాయి.