Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగ చైతన్య ఏమాయ చేశావే సినిమాతో మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. ఆ సినిమాతో వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది.. ఆ తరువాత నాగ చైతన్య సమంత కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.. టాలీవుడ్ క్యూట్ రొమాంటిక్ జోడీగా గుర్తింపు సంపాదించుకున్నారు.. వీరి ప్రేమ మొదలై అప్పటికే ఏడు సంవత్సరాలు గడించింది.. అప్పటికే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది..
మరోవైపు సమంత, నాగ చైతన్య అభిమానులు కూడా ఈ రీల్ జంట రియల్ లైఫ్ జోడి అయితే బాగుంటుంది అని అంతా అనుకున్నారు. ఇదే అదే నిజం చేసి చూపించారు సామ్ చైతన్య.. పదేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహాన్ని వైభవంగా చేసుకున్నారు.. 2017 అక్టోబర్ 6 న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వీరిద్దరూ మూడేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.. వారు కలుసుకున్న మూడు పెళ్లి రోజులు సెలబ్రేషన్స్ కి కూడా సమంత చైతు పై ఇంట్రెస్టింగ్ నోట్ రాస్తూ ఫోటోలను విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి..
చైతు సమంత తమ మొదటి పెళ్లి రోజుకి అక్కినేని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు.. అక్కడ చైతుతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ..”నేను రోజు ఇంటికి వచ్చి నిన్ను చూడడమే నా జీవితంలో సంతోషకర విషయం “అంటూ క్యాప్షన్ ఇచ్చింది .సమంత ఇక రెండో పెళ్లి రోజుని ఇంట్లోనే జరుపుకున్న ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు .ఈ నేపథ్యంలో సమంత “స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్.. పెళ్ళై రెండేళ్లు.. పదేళ్ల కథ.. ఇప్పటికీ నీతోనే” .. అంటూ క్యాప్షన్ పెట్టింది.
మూడో పెళ్లి రోజు చైతు కోసం ఓ అందమైన ప్రేమలేఖ రాసింది సమంత .. “చైతన్య నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని.. జీవితంలో ఏ అడ్డు వచ్చినా కలిసి పోరాడుదాం”.. అంటూ అందమైన నోట్ ను రాసుకొచ్చింది..మూడేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంటను చూసి అందరూ ముచ్చట పడ్డారు.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ వీరిద్దరూ విడిపోయారని అంతా అనుకున్నారు.. కానీ సమంత నాగచైతన్య విడిపోవడానికి ఓ బలమైన కారణం ఉందని సమంత వాదన.. నా వైపు నుండి కూడా అదే వాదన అని చైతన్య..
అక్కినేని నాగచైతన్య సొంత తల్లి దగ్గుబాటి వారసురాలు.. నాగచైతన్య కి తన అమ్మ తరుపు అన్నయ్య, తమ్ములు పిల్లల కూతుర్లు వరసకి మరదలు అవుతారు. అలా దగ్గుబాటి కుటుంబంలో నాగచైతన్యకు వరసకి మరదలు అయినా ఒక అమ్మాయి ఉండేదట.. అమ్మాయితో చిన్ననాటి నుంచి ఉన్న స్నేహంతో చైతన్య కూడా చనువుగా ఉండేవాడట. ఆ విషయం సమంతా కి పరిచయమైన మొదట్లోనే నాగచైతన్య చెప్పాడట. అంతెందుకు సమంత నాగచైతన్య కలిసి ప్రేమలో ఉన్నప్పుడు కూడా చైతు ఆ అమ్మాయితో తరచూ మాట్లాడేవాడట.. అప్పుడప్పుడు సమంత అమ్మాయితో మాట్లాడటం ఇష్టం లేదని చెప్పేదట.. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం తప్ప మరింకే చెడు భావన మా ఇద్దరి మనసుల్లో లేదని నాగచైతన్య తో పాటు ఆ అమ్మాయి కూడా సమంతకు వివరణ ఇచ్చిందట..
ఆ విషయం అర్థం చేసుకున్న సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారిద్దరూ మాట్లాడుకోవడం మాత్రం సమంతకు ఏ మాత్రం ఇష్టం లేదట. తనతో మాట్లాడకూడదని సమంత కండిషన్ పెట్టిందట. ఆ విషయం మీదే సమంత నాగచైతన్యకి తరచూ గొడవలు అయ్యావట.. ఇక అలాంటి సమయంలోనే సమంత రంగస్థలం సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించడం.. ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం అక్కినేని ఫ్యామిలీకి.. ముఖ్యంగా నాగార్జునకి నచ్చలేదట.. ఆ విషయం మీద కూడా సమంత నాగచైతన్యలకే గొడవలు జరిగాయట.. ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నాగచైతన్యకు ఇష్టం లేకపోయినా సమంత నటించిన ఇవన్నీ వారి విడాకులకి దారితీసాయి..