Viswanadh: కళాతపస్వి కె విశ్వనాథ్ గురించి ఎంత మాట్లాడుకున్నా.. ఇంకా కొంత మిగిలే ఉంటుంది.. అచ్చమైన తెలుగు దానానికి విశ్వనాథ్ సినిమాలు అద్దం పడతాయి.. అనేక కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించిన కళాతపస్వి ఆయన. అయితే బాలకృష్ణ తో ఒకరోజు ఆయన ఒక మల్టీ స్టారర్ సినిమా గురించి చర్చించారు.. ఆ సినిమా లైన్ వినగానే.. బాలయ్య వెంటనే ఒకే చెప్పేశాడట..
ఈ మల్టీస్టారర్ సినిమాలో నటించే మరొక హీరో ఎవరో కాదు మన మెగాస్టారే.. సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవి, బాలయ్య ను చూడాలని ఎంతో మంది అభిమానుల కోరిక .. ఆ కోరిక కళాతపస్వి కి కూడా ఉందట. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమా లో నటించడమే అదృష్టం అనుకునే వారు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. అది ఆయనకు ఉన్న విలువ, కెపాసిటీ.. అలాంటిది ఆయన దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా అంటే ఇప్పటి ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా సరిసాటి రావని చెప్పొచ్చు.. ఇక ఇద్దరి హీరోల ఎమోషన్స్, లవ్, యాక్షన్ ఆయన అయితేనే సమపాళ్లలో వడ్డించి ప్రేక్షకులకు అసలైన విజువల్ ట్రీట్ విందు భోజనం అందిస్తారు.. ఇక అదే ఆశతో బాలయ్య, చిరంజీవి ఉన్నారట. కానీ ఆ పరమేశ్వరుడినీ ఇష్టపడే కళాతపస్వి ఆయనలోనే ఐక్యం చేసుకున్నాడు..
ఇక ఈ సినిమాను ఒక ఛాలెంజ్ గా ఆయన తనని అడిగిన ఆఖరి కోరిక గా భావించిన బాలయ్య.. ఈ సినిమాను ఎలాగైనా తీయాలని అనుకున్నారట.. అందుకే ఆయన చనిపోయిన రోజే ఆ సినిమా గురించి ఆ టాప్ డైరెక్టర్ తో మాట్లాడి ఫైనల్ చేశారట. కళాతపస్వి కోరుకున్నట్టే బాలయ్య, చిరంజీవి మల్టీ స్టారర్ సినిమా కి బాలయ్య శ్రీకారం చుట్టారని.. అది కె విశ్వనాథ్ మీద అయనుకున్న ప్రేమ అని అర్థం చేసుకోవచ్చు. ఈ న్యూస్ విని పలువురు సినీ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు.