K Viswanadh : ఆదర్శనీయం.. ఇప్పటి దర్శకులు మల్టీ స్టారర్ ట్రెండ్ ను మళ్ళీ కొనసాగిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మల్టీ స్టార్ ట్రెండ్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.. ఇక ఇదే ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది.. ఆ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
ఇక అదే మల్టీ స్టారర్ ట్రెండ్ లో కె విశ్వనాథ్ కూడా టాలీవుడ్ దిగ్గజ నటులైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఓ చిత్రాన్ని తీయాలని అనుకున్నారట.. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయ్యారట. ఇక అదే విషయాన్ని బాలయ్య, చిరంజీవి తో కూడా చెప్పారట. పెద్దవారు మీరు అడిగితే మేము కాదంటానా.. అయినా మీ మాట మేము ఎప్పుడు కాదన్నామని.. మీరు కోరుకున్న విధంగానే సినిమా తీద్దామని బాలకృష్ణ, చిరంజీవి కూడా ఒప్పుకున్నారట..
అయితే బాలకృష్ణ, చిరంజీవి కి అప్పటికే పలు సినిమాలు ముందుగానే ఒప్పుకుని ఉండటంతో వాటన్నింటినీ కంప్లీట్ చేసుకున్న తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో ఇద్దరు కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నారట. ఇద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదలవ్వడం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగాయి. ఇంతలోనే కళాతపస్వి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. బ్రతికి ఉంటే ఈ మల్టీ స్టారర్ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఉండేది. ఈ విషయం తెలిసిన పలువురు దర్శకులు ఆయన ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయారని బాధపడుతున్నారు. ఇక అదే విషయాన్ని తలుచుకొని చిరంజీవి బాలయ్య కూడా బాధపడ్డారు.