Taraka Ratna : నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాల 23 రోజులు బ్రతుకుతూ పోరాటం చేసి కన్నుమూశారు ఇది నందమూరి కుటుంబ సభ్యులకు అభిమానులకు ఎంతో బాధాకరం సినీ రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న ఇద్దరు అన్నదమ్ములు. ఎన్టీఆర్ కంటే తారకరత్న పెద్దవాడు. అలాగే తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ అప్పటికే హీరోగా కెరియర్ ప్రారంభించి మంచి సక్సెస్ కూడా అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే నాకు ఎప్పుడూ పోటీ లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు తారకరత్న. మా ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనుబంధం మాత్రమే ఉందని కోపద్వేషాలకు తావేలేదని తారకరత్న స్పష్టం చేశారు.. అటువంటి మంచి మనిషి ఈ లోకం నుంచి లేరని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ నారా బ్రాహ్మణి కన్నీటి పర్యంతమయ్యారు..
తారకరత్న స్వగృహానికి విచ్చేసి ఆర్తివదేహాన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ బోరున విలపించారు. తన అన్న మళ్లీ తిరిగి పూర్తి ఆరోగ్యంతో వస్తారని అనుకుంటే .. విధి ఆయనను తీసుకు వెళ్ళడం అందరినీ బాధ పెడుతుంది.
తన సోదరుడు తారకరత్నను చూసి నారా బ్రాహ్మణి ఎమోషనల్ అయ్యారు. ఆయన భార్యా పిల్లలను ఓదార్చారు. తారకరత్న పిల్లల్ని చూసి నారా బ్రాహ్మణి ఎమోషనల్ అయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. తారకరత్న పిల్లల్లో తన అన్నను గుర్తు చేసుకుని బాధపడ్డారు. నా పక్కనే కూర్చుని ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను పట్టుకొని బ్రాహ్మణి ఎమోషనల్ అయింది.