Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. సమంత నాగచైతన్య తో విడిపోయిన తరువాత తను మరొక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉందని.. కాదు కాదు అతని వల్లే సమంత నాగచైతన్య విడిపోయారని పలు రకాలుగా వార్తలు వినిపించాయి.. సమంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ప్రీతమ్ జుకల్కర్ వాళ్లని సమంత నాగ చైతన్య విడిపోయారని .. ఒక విధంగా ఇతని వల్లే వాళ్ళిద్దరూ విడిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారని.. అప్పట్లో ఆయనని విపరీతంగా ట్రోల్ చేశారు జనాలు. అంతేకాదు ప్రీతమ్ ని ఏకంగా గే అంటూ కూడా ట్యాగ్ చేశారు. అలాంటి కామెంట్స్ ను ప్రీతమ్ లైట్ తీసుకున్నారు.. కానీ నావల్ల సమంత చైతు విడిపోలేదని.. సమంత నాకు అక్క లాంటిదని అందరి కీ చెబుతూ ఓ పోస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.. అయినా కానీ నెటిజెన్స్ వాటిని నమ్మలేదు ఇప్పటికీ ప్రీతం వలనే వీళ్లు విడిపోయారంటూ ట్రోల్ చేస్తూనే ఉంటారు..
సమంతకి అతగాడితో ఎఫైర్ ఉందని ఆ కారణంగానే చైతన్యకు విడాకులు ఇచ్చిందని రకరకాలుగా కామెంట్స్ చేశారు అప్పట్లో.. ఇక ఇలాంటి వాళ్లకి సమంత మరొక అవకాశం ఇవ్వకూడదని.. ప్రీతమ్ జుకల్కర్ కి ను సమంతా దూరం పెడుతుందని సమాచారం. మా ఇద్దరి మధ్యన ఏం లేదని అక్క తమ్ముడు అని చెప్పినా కూడా ట్రోల్స్ ఆగకపోవడంతో.. ప్రీతమ్ కి దూరంగా ఉండటమే కరెక్ట్ అని సమంత నిర్ణయించుకున్నారట.
ఇక అదే ఫాలో అవుతున్నారని సమాచారం. ఉన్నది ముఖాన్నే మాట్లాడే సమంత లేడీ ఫైర్ బ్రాండ్ గా కూడా ట్యాగ్ సంపాదించుకుంది. మరి అలాంటి సమంత సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన కామెంట్స్ కి భయపడి ప్రీతమ్ ని దూరం పెట్టడం.. ఎంతవరకు కరెక్ట్ అంటూ సమంత ఫ్యాన్స్ మండిపోతున్నారు.
సమంత తన ఫ్రెండ్ ని దూరం పెడితే జనాలు అనుకునేదే నిజమవుతుందని అలా చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
బాలీవుడ్ హీరోతో సమంత ప్రేమాయణం నడుపుతుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ రోజు అయినా ఏ క్షణాల్లోనైనా రావచ్చని వీరి ప్రేమ గురించి బాంబు పేల్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటన్నింటికీ సమంత ఓ బలమైన ఆన్సర్ తో గాని సమాధానం ఇవ్వనుందని తెలుస్తోంది.