Taraka Ratna : తారకరత్న కోసం బాలయ్య చేసిన గొప్ప త్యాగానికి , వలవలా ఏడ్చేసిన అలేఖ్య రెడ్డి !

Taraka Ratna: తారకరత్న యువగళం పాదయాత్రలో పడిపోయినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ అన్ని తానే దగ్గరుండి చేసుకుంటున్నారు.. సినీ, రాజకీయ పరంగా ఉన్న బిజీ షెడ్యూల్ అన్నింటినీ పక్కనపెట్టి.. తారకరత్న కు మెరుగైన వైద్యం అందించడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే మతం వేసి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Taraka Ratna health condition good for balakrishna for special Pooja
Taraka Ratna health condition good for balakrishna for special Pooja

ముందుగా తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోయిన సందర్భంలో బాలకృష్ణ స్పందించిన తీరు కారణంగా తిరిగి తారకరత్న కోలుకున్నారని వైద్యులు తెలిపారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని బాలయ్య మరో సంకల్పం తీసుకున్నారు. ఆఖండ దీపారాధన చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి దీపారాధన కొనసాగుతోంది.. కటోర దీక్షతో నియమపద్ధంగా అఖండ దీపారాధన జరుగుతుంది. దీపాలను ప్రమిదల్లో కాకుండా మట్టి, కంచు పాత్రలో వెలిగిస్తారు.

అఖండ జ్యోతి దీపారాధన సుమారు 44 రోజులపాటు కొనసాగుతుంది. తారకరత్న ఆరోగ్యం కూడా రోజురోజుకీ మెరుగవుతుంది. కాలేయం, గుండె పనితీరు మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతుంది. తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్య తీసుకున్న శ్రద్ధ అంతా కాదు మొదటి రోజు నుంచి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని బాబాయి బాలకృష్ణ పరితపిస్తున్నారు.

అన్న కొడుకును కూడా సొంత కొడుకుల కంటికి రెప్పలా కాచుకొని ఉన్నారు. బాలయ్య తీరు ఆయన అభిమానుల్ని గర్వపడేలా చేస్తుంది. బాలయ్య తారకరత్న కోసం చేస్తున్న కృషి ఫలించాలని అభిమానులు కోరుకుంటున్నారు.. బాలకృష్ణ తారకరత్న కోసం చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమం గురించి తెలుసుకొని అలేఖ్య రెడ్డి వలవల ఏడ్చేసిందట.