BREAKING : మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి గ్రాండ్గా ఫిబ్రవరి నెల రెండవ తేదీన జరగనుందని వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి. గత నెల నుంచి వీరి పెళ్లి వార్తలు ప్రచారంలోకి వచ్చినా.. ఫిబ్రవరి 2వ తేదీ ముగిసిన మనోజ్ పెళ్లి జరిగినట్టు ఎక్కడ వార్తలు రాలేదు.. కొన్ని రోజుల నుంచి కొత్త సినిమాలు ప్రకటించిన మంచు మనోజ్ తన పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం మనోజ్ సైలెంట్ గానే ఉన్నారు. కుటుంబ సమస్యల వల్లే మనోజ్ మౌనికల పెళ్లి వాయిదా పడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మనోజ్ మౌనిక పెళ్లి జరగనుందని.. వీళ్ల పెళ్లి జరగడం ఖాయం. కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఓ స్పష్టతకి రావడం లేదు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలే అందుకు ఓ కారణమని సమాచారం. వీరిద్దరి పెళ్లి జరగడానికి మరికొంత సమయం పడుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు..
మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ రేంజ్ అంతకు అంతకు పెరగాలని ఇకపై మనోజ్ చేసే సినిమా ప్రాజెక్టులన్ని సక్సెస్ అవ్వాలని అంట అనుకుంటున్నారు.. మంచు ఫ్యామిలీపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ఉన్న మంచు మనోజ్ మాత్రం ఈ విషయంలో మినహాయింపును కలిగి ఉన్నారు.
మంచు మనోజ్ గతంలో ఓకే చెప్పినా అబ్రహం బ్రహ్మాస్మి సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా ధియేటర్స్ లో ఎప్పుడు విడుదల అవుతుందో కూడా స్పష్టత రావాల్సి ఉంది. మనోజ్ నటుడుగా తన క్రేజ్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారని చెప్పాలి. సొంత బ్యానర్ లో మనోజ్ సినిమాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు రీమేక్ సినిమాలపై మనోజ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని గతంలో కూడా వార్తలు వినిపించాయి.