Vani Jairam : BREAKING : దిగ్గజ గాయని వాణి జయరాం వార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన గానమృతంతో భారతీయ సమాజాన్ని ఓడలాడించిన ఓ గొంతు శాశ్వతంగా మూగబోయింది.. దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్నిగా వెలిగిన గాన కోకిల వాణీ జయరాం అనంత లోకాలకు తరలి వెళ్ళిపోయారు. ఆమెది మరణం కాదని హత్యగా పరిగణిస్తున్నారు పోలీసులు..
Advertisement
Vani jayaram mistery on telling her worker
వాణి జయరాం ముఖంపై బలమైన గాయాలతో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండడంతో.. ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం అందించింది. దాంతో వెంటనే వాణి చేయడం ఇంటికి పోలీసులు వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారు. వాణి జయరాం మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాణి జయరాం పోస్ట్ మార్టంలో ఆమె తలకు గాయమైనట్లు గుర్తించారు. ఒకటిన్నర ఇంచు లోతు గాయమైనట్లుగా తేలింది. అయితే వాణి జయరాం తలకు తగిన గాయం పై ఇప్పుడే నిర్ధారణకు రాలేమన్నారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం వాణి జయరాం అంత్యక్రియలు జరగనున్నాయి.
Advertisement
ఈ నేపథ్యంలో వాణి జయరాం ఇంటికి సమీపంలోనే సిసి ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని పోలీసులు వేచారిస్తున్నారు. ఆమె ఇంట్లో పని చేస్తున్న పని మనిషి ఆమె మరణం పై స్పందించారు. నిన్న రాత్రి కూడా బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆమె వీడియోతో మాట్లాడుతూ.. నేను సుమారుగా 10 సంవత్సరాలుగా వాణి జయరాం చేయడం ఇంట్లో పని చేస్తున్నానని.. ఆమె ఇంట్లోనే ఉంటారు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఎప్పటిలాగే నేను ఈరోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఇంటికి వచ్చాను. ఇంట్లోకి వెళ్లడానికి కాలింగ్ బెల్ కొట్టాను. ఎప్పుడూ ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది.
అయితే ఈసారి ఏంటో డోర్ ఓపెన్ చేయలేదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. వెళ్లే ముందు కచ్చితంగా నాకు చెప్పే వెళ్తారు. చాలా కాలింగ్ బెల్ కొట్టాను. అయినా డోర్ ఓపెన్ చేయలేదు. కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు. సాధారణంగా మేడం అలా ఎప్పుడూ చేయరు. నాకెందుకో భయమేసింది. వెంటనే నా భర్తకు సమాచారం అందించాను. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదు అయితే నుదుటిపై గాయాలు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ బోరున విలపించింది. దాంతో వాణి జయరాం ది కచ్చితంగా హత్య అంటున్నారు ఆమె అభిమానులు .వాణి జయరాం మరణానికి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.