Rajanikanth : రజినీకాంత్ జీవితాన్ని మార్చేసిన ఆ అమ్మాయి కోసం ఇప్పటికీ ఎదురు చూపులు.!

Rajanikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో కాక ముందు బెంగళూరులో బస్సు కండక్టర్ గా పని చేశారు. ఆ రోజుల్లో ఎంబిబిఎస్ చదివే అమ్మాయి తరచుగా రజనీకాంత్ డ్యూటీ చేసే బస్సులోని ఎక్కువగా ప్రయాణం చేసేది. అలా వాళ్ళిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక ఆ సమయంలో రజినీకాంత్ నాటకాలు వేసేవారు. ఒకరోజు ఆ అమ్మాయి రజిని నాటకాన్ని చూసి సంతోషించడంతోపాటు రజనీకాంత్ కి ఎవ్వరూ ఊహించలేని గిఫ్ట్ ఇచ్చింది.. అదేంటంటే.!?

Super Star Rajini kanth searching for that girl
Super Star Rajini kanth searching for that girl

రజిని కి చెన్నైలోనే అడ్డయ్యర్ ఇన్స్టిట్యూట్ కు రావాల్సిందిగా ఒక లెటర్ వచ్చింది. అది రజినీకాంత్ అప్లై చేయలేదంట. బస్సులో వెళ్తుండగా ఆ అమ్మాయి లెటర్ వచ్చిందా అని రజిని అడిగిందట.. ఆయన ఆశ్చర్యపోయి నువ్వే అప్లై చేసావా అని అడిగితే.. ఆమె అవునని చెప్పింది. మరి వెళ్లి జాయిన్ అవ్వమని రజనీతో చెబితే.. అందుకు కావలసిన డబ్బులు లేవని రజిని అనడంతో.. తనే 500 రూపాయలు ఇచ్చి నీకు ఎంతో టాలెంట్ ఉంది. నీ ప్రతిభకి నువ్వు యాక్టింగ్ లో ఎంతో ఎత్తుకు ఎదగగలవు. ప్రపంచంలోనే గొప్ప నటుడు అయ్యే సత్తా నీలో ఉంది. నీ పోస్టర్లు కటౌట్లను నేను ఇక్కడ చూడాలి. నువ్వు కచ్చితంగా వెళ్ళమని ఆమె పట్టుబట్టి రజినికాంత్ ను ఫిలిం ఇన్స్టిట్యూట్ కు పంపించిందట. ఆ తరువాత రజిని మళ్ళీ అదే బెంగళూరు వచ్చి ఆ బస్సులోనే రెండు రోజులు పాటు ఆమె కోసం ఎదురు చూశాడట. ఇక తను ఎక్కడ ఉంటుందో అడ్రస్ కనుక్కొని వెళ్ళగా ఆమె వారం రోజుల కిందటే అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకున్నారట. అప్పటినుంచి ఇప్పటివరకు రజినీకాంత్ ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడట. గొప్ప వాడైనా రజినీకాంత్ ను ఆమె దూరంగా చూస్తూ ఉండిపోయింది తప్ప ఇంతవరకు తిరిగి రాలేదట. అది ఆమె గొప్పతనం అని రజనీకాంత్ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.