Prabhas – Nayanatara : ప్రభాస్ సెట్లో అలా చేయకుండా ఉండలేడన్న నయనతార వైరల్ కామెంట్స్..!

Prabhas – Nayanatara : నయనతార నటించిన లేటెస్ట్ చిత్రం కనెక్ట్ .. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ నేపథ్యంలో నయనతార ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనింది. తాజాగా నయనతార సుమాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Nayanatara vairal comments on prabhas on connect movie promotions
Nayanatara vairal comments on prabhas on connect movie promotions

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ నయనతారను ప్రభాస్ తో కలిసి మీరు మున్నా సినిమాల్లో నటించారు. ప్రభాస్ ఆ సినిమా సెట్ లో ఎలా ఉండేవారు అని అడుగగా.. ప్రభాస్ ది చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి వారు. తనతో కలిసి సినిమా షూటింగ్లో ఎప్పుడు సరదాగా ఉంటూ జోకులు వేసే వారిని నయనతార చెప్పుకొచ్చారు.

ప్రభాస్ సెట్ లోకి వచ్చారంటే ఒకచోట స్థిమితంగా ఉండరు.. ఎగరడం, గంతడం, దూకడం చేస్తూ ఉంటారు. ప్రభాస్ సెట్ లో ఉంటే సెట్ అంతా అల్లరి అల్లరిగా ఉంటుందని.. ప్రభాస్ తో షూటింగ్ అంటే సరదాగా ఉంటుంది అని నయనతార మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారని.. ప్రస్తుతం ఆయన సెట్ లో ఎలా ఉంటున్నారు నాకు తెలియదని నయనతార చెప్పుకొచ్చింది..