Kruthi Shetty : అలాంటి అవతారంలో కనిపించిన కృతి శెట్టి.. ఫొటోస్ వైరల్..!

బేబమ్మ అలియాస్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమా ద్వారా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న కృతి శెట్టి ప్రస్తుతం నాగచైతన్య సరసన మరొక సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న కృతి శెట్టి వరుస ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో మంట పెడుతోంది.

Kruthi Shetty shared avatar type photos..!
Kruthi Shetty shared avatar type photos..!

ఇదిలా ఉండగా నిత్యం వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా అవతార్ ఫిల్టర్స్ ద్వారా తన ఫోటోలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్ స్టా ద్వారా పంచుకున్న ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. నీలో ఇలాంటి షేడ్స్ కూడా వున్నాయా అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.