sudigali Sudheer : బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మొదట్లో మెజీషియన్ గా రామోజీరావు ఫిలిం సిటీ లో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత జబర్దస్త్ వేణు ద్వారా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ అక్కడే స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు అక్కడ లభించిన క్రేజ్ తో మళ్లీ ఈటీవీలోనే ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించిన ఈయన.. సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు అలా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా చేసిన సుధీర్ కి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.

కా తర్వాత తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను లతో కలిసి కొన్ని వందల ఎపిసోడ్లను పూర్తి చేసిన ఈయనకు స్టార్ మా భారీ ఆఫర్ చేయడంతో జబర్దస్త్ ను కూడా వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ కూడా ఇప్పుడు అడపాదడపా కనిపిస్తూ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసాడు సుధీర్. ఇకపోతే ఇటీవల గాలుడు సినిమాతో తన ఖాతాలో మంచి హిట్టు వేసుకున్న ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇకపోతే సుధీర్ గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ రష్మీతో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే కానీ పెళ్లి చేసుకుంటారా అంటే ఇది కేవలం తెరవరకూ మాత్రమే పరిమితం అంటూ కొట్టి పారేశారు అటు రష్మీ కూడా బయట సీక్రెట్ గా ఒక లవర్ ని మెయింటైన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా సుడిగాలి సుధీర్ కి నిశ్చితార్థం జరిగిపోయింది అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అందులో అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది మరి ఇది నిజమైన నిశ్చితార్థమా లేక ఫేక్ ఫోటోనా అన్నది మాత్రం తెలియలేదు మొత్తానికైతే ఈ ఫోటో చూసి సుదీర్ అభిమానులు సంబరపడిపోతున్నారు.