Chandrababu Naidu : నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరగటంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ మెజార్టీ స్థానాలు గెలవడం తెలిసిందే. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 108 నియోజకవర్గాలలో టీడీపీ అత్యధికమైన స్థానాలు గెలిచి తిరుగులేని శక్తిగా అవతరించింది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ఎన్నికలలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. స్థానిక ఎన్నికలలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం టీడీపీ ఓటమిపాలయ్యింది. కానీ సరిగ్గా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు టిడిపి గ్రాఫ్ అమాంతం పెరగడంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

ఇప్పటికే వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ కీలక నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున నిర్వహించటం జరిగింది. ఈ క్రమంలో తన జన్మదినం సందర్భంగా మార్కాపురం మహిళా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు స్వయంగా తన చేతులతో మహిళలకు భోజనాలు పెట్టారు.
అనంతరం బట్టలు కూడా పంచటం జరిగింది. స్వయంగా చంద్రబాబు భోజనాలు మరియు బట్టలు అందించడంతో.. తీసుకున్న ప్రజలు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పలు కీలకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తూ ఉండగా మరోపక్క నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేక విధానాన్ని బయటకు తీసుకురావడానికి టీడీపీ తనదైన శైలిలో కృషి చేస్తూ ఉంది.
https://www.youtube.com/watch?v=JJEzTqMrD3A