Mahesh Babu : మలయాళం ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. ఏకంగా ఐదు సినిమాలలో నటించి అన్నింటిలో కూడా సూపర్ హిట్ అందుకున్న ఏకైకనటి అని చెప్పవచ్చు. ఇక అందుకే ఈమెను ప్లాటినం లెగ్ అంటూ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కామెంట్లు చేసినట్లుగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈమెది గోల్డెన్ లెగ్గు కాదు ఏకంగా ప్లాటినం లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో రానాకు భార్యగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సంయుక్త మీనన్ అంతే కాదు ఇటీవల హీరోగా తెలుగులో నటించిన మొదటి చిత్రం సార్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక తాజాగా సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న విరూపాక్షా సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇక ఈరోజు ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈమె ను అందరూ ప్లాటినమ్ లెగ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.
ఇదిలా ఉండగా విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్తాకు కొంతమంది హీరోల గురించి చెప్పమని అడిగినప్పుడు ఆమె ఇలా వివరించింది. ప్యూర్ హార్ట్ ఉన్న హీరో ఎవరు అంటే సాయిధరమ్ తేజ పేరు చెప్పిన ఈమె.. పీపుల్ స్టార్ అనగానే పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. ఇక ఆల్ టైం ఫేవరెట్ సూపర్ స్టార్ హీరో నాని పేరు చెప్పగా.. మహేష్ బాబు పేరు చెప్పగానే మెలికలు తిరుగుతూ ఒక అద్భుతమైన పాట పాడింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.