Director : తండ్రి కాబోతున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్..! 

Director : సినీ ఇండస్ట్రీలో వరస మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వరుస జననాలు కూడా అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి. కొంతమంది స్టార్ నటీనటులు స్వర్గస్తులవుతుంటే.. మరికొంతమంది స్టార్ నటీనటులు తల్లిదండ్రులవడం అందరికీ ఆనందాన్ని కలుగజేస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు పది సంవత్సరాల పాటు మాతృత్వానికి దూరంగా ఉన్న ఉపాసన కొణిదెల ఇటీవల తల్లి కాబోతోంది అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పలువురు ప్రముఖుల నుంచి శుభాభినందనలు అందాయి.

Advertisement
Star director become a father..!
Star director become a father..!

ఇప్పుడు తాజాగా మరొక గుడ్ న్యూస్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తండ్రి కాబోతున్నట్లు సమాచారం. కృష్ణప్రియ – అట్లీ 2014లో వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వారు తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో అట్లీ, ప్రియ దంపతులకు నెటిజెన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికైతే దాదాపు 8 సంవత్సరాల తర్వాత తండ్రి కాబోతున్నానని తెలిసి అట్లీ ఆనందానికి అవధులు లేవని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement