waltair veerayya : వాల్తేరు వీరయ్య కొత్త పోస్టర్ వైరల్.. పక్కా మాస్ అంటూ..! 

waltair veerayya :వచ్చే ఏడాది సంక్రాంతి రోజున చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం వాల్తేరు వీరయ్య. థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబి కొల్లి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

Advertisement
Release a new poster from Walteru veeraya..!
Release a new poster from Walteru veeraya..!

ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు . దీనిలో మెగాస్టార్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు పక్క ఊర మాస్ లెవెల్లో చిరంజీవి లుక్ చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్లో చాలా వైరల్ గా మారింది. ఈ సినిమాలో రవితేజ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈయనకు సంబంధించిన ప్రీ లుక్ టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే ఈ సినిమా మాస్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement