Srija : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదల విడాకులకు సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ డివోర్స్ తీసుకుంటుంది అంటూ ఆన్లైన్ వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా.. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవలేదు. దాంతో శ్రీజ డివోర్స్ నిజమే అని అంతా అనుకుంటున్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది..
ముందుగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా నుండి కళ్యాణ్ దేవ్ పేరును తొలగించడంతో .. వీరిద్దరి విడాకుల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అలాగే కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీలో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం.. ఈ రూమర్స్ కి బలాన్ని ఇచ్చింది. శ్రీజ తో విభేదాలు అనే మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ దేవి నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలను ప్రమోట్ చేయకపోవడంతో మరిన్ని అనుమానాలకు తెర పైకి వచ్చాయి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలతో ప్రస్తుతం శ్రీజ వేరువేరుగా ఉంటున్నారనేది మాత్రం జనాలకు ఓ క్లారిటీ వచ్చింది.
ఈ పరిస్థితుల నడుమ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతుంది. ఫిబ్రవరి 11న తన కూతురు నవిష్క పుట్టినరోజు కావడంతో ఎమోషనల్ అవుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. కళ్యాణ్ నవీష్కతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మిస్సింగ్ యూ అని కామెంట్ చేశారు. దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకుల మేటర్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది.
ఇద్దరు విడిపోయారు కాబట్టే ఇలా కూతురు జ్ఞాపకాలతో ఎమోషనల్ అయ్యారని అంతా అనుకుంటున్నారు. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం కాగా 2018లో పాప పుట్టింది. ఈ పాపకు నవిష్క అనే పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీజ వద్దని నవిష్క ఉందని కళ్యాణ్ దేవ్ పోస్టుతో ఫుల్ క్లారిటీ వచ్చింది. శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంతకాలం అతనితోపాటు సంతోషంగా ఉంది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అతనితో వాళ్ళ అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తరువాత చిరంజీవి దగ్గర బంధువులైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని ఇచ్చి రెండో వివాహం చేశారు. ఇప్పుడు ఏ బంధం కూడా బ్రేక్ అయినట్లు తెలుస్తోంది . మరోవైపు శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమైంది అనే టాకు కూడా వినిపిస్తోంది.