Tollywood Industry : సినిమా పరిశ్రమ మొత్తం ఈ వార్త తెలిసాక విపరీతంగా బాధ పడుతున్నారు .. తరలి వస్తున్నారు !

Tollywood Industry : సినీ పరిశ్రమలో వరుసగా పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. తాజాగా మరో సీనియర్ రచయిత మరణంతో తెలుగు సినీ పరిశ్రమంలో విషాదం అలుముకుంది. జర్నలిస్టుగా, కవిగా, పుస్తక రచయితగా, సినిమా రచయితగా తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పనిచేసిన యడ్లవల్లి వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి శనివారం రాత్రి మరణించినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు..


గత కొన్ని రోజులుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి విజయవాడలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. యడ్లవల్లి వెంకట లక్ష్మి నరసింహ శాస్త్రి తెలుగు కన్నడ తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేశారు.కన్నడలో ఆయన 15 సినిమాకు పైగా రచన సహకారం అందించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ సభ్యులుగా కూడా ఉన్నారు ఒక తమిళ సినిమాని దర్శకుడిగా రూపొందించారు.

సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ కి కూడా ఆయన కథలు అందించారు. ఆయన రాసిన కవితలు రచనలను మెచ్చి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలిచి మరీ ప్రశంసికించారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం విజయవాడలో ఆయన అంత్యక్రియలు జరిపారు.

ఎడ్లవల్లి ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ఆయన అనారోగ్య కారణాలతో విజయవాడలో నివసిస్తున్న తన తమ్ముడు యడ్లవల్లి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. అయితే తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయనను హాస్పిటల్ కు తీసుకువెళ్లి సుమారు 50 రోజుల నుంచి చికిత్స అందిస్తున్న ఆయన కోలుకోలేదు. యడవల్లి వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి ఇక లేరన్న విషయం తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలి వస్తున్నారు.