బ్రేకింగ్ : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మూడు నాలుగు రోజులకే పరిమితమయ్యారని.. వరస్ట్ పర్ఫామెన్స్ జాబితాలో 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం జగన్ స్వయంగా 20 మంది పేర్లు చదివి వినిపించారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది అని జగన్ అన్నారు. ఇందులో కొడాలి నాని , వసంత కృష్ణ ప్రసాద్, కామినేని ఉదయభాను ఉన్నారని తెలుస్తుంది.. ముందస్తు ఎన్నికలు లేదని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.
అసలు తిరగనివారు తక్కువ రోజుల తిరిగిన వారికి సీఎం క్లాస్ పీకారట కొడాలి నాని, ఉదయభాను , వసంత కృష్ణ ప్రసాద్ గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని సీఎం జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇక కొందరు ఎమ్మెల్యేలు మూడు నాలుగు రోజులకే పరిమితమయ్యారని మండిపడ్డారట. మార్చి 18 నుంచి మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమం జరగనుంది. ఈ లోగా కన్వీనర్లు , గృహ సారధులకు శిక్షణ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఎన్నికల దిశగా వేగం పెంచారు. కొత్త వ్యూహంతో ముందుకి వెళ్తున్నారు . ఎమ్మెల్యేల పనితీరుపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
జగన్ ప్రజలతో మమేకం అయ్యేలాగా ఎమ్మెల్యేలను గడపగడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు వై నాట్ 175 ప్రతి నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యేల పనితీరు ప్రతిపాదికగా సర్వే నివేదికలు అందుతున్నాయి. గెలిచే వారికే టికెట్లు అని స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన వారికి హెచ్చరికలు కూడా చేశారు.
ఇంకా 14 నెలలే ఎలక్షన్లకు సమయం ఉందనే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్య నాయకులకు హితబోధ చేశారు. ఇందులో ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించాలని, అలాగే వారి ఫోన్లకి స్టిక్కర్లు అందించే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది.