SreeMukhi : పెద్దింటి కోడలు కాబోతున్న శ్రీముఖి.. నిజమేనా..?

SreeMukhi : బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా తన కెరియర్ను కొనసాగిస్తున్న ఈమె అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు డిజిటల్ మనీ కోసం ప్రయత్నం చేస్తున్న శ్రీముఖి ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి నిత్యం వరుస గ్లామర్ ఫోటోషూట్లతో మరింతగా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇకపోతే గత కొద్ది రోజులుగా శ్రీముఖి పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

Sree mukhi going to get ready for marriage..!
Sree mukhi going to get ready for marriage..!

అయితే ఇప్పుడు ఏకంగా బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి కోడలుగా వెళ్లబోతుందని సమాచారం. శ్రీముఖిని దగ్గరగా చూసిన ఆ ప్రొడ్యూసర్ తనకు కొడుకు వరుస అయ్యే అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని ఆలోచించి.. వెంటనే శ్రీముఖి నాన్నగారితో పెళ్లి విషయంపై చర్చించారట.. శ్రీముఖి తండ్రి తన కూతురి ఇష్టాలను గౌరవించే వ్యక్తి .. అయితే శ్రీముఖి ఒప్పుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారట. కానీ శ్రీముఖి మాత్రం ఈ పెళ్లికి అంగీకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి . ఎందుకంటే ఆమె మరొకరితో ప్రేమలో ఉండడం వల్లే ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ బాయ్ ఫ్రెండ్ ను కూడా పరిచయం చేయబోతుందని సమాచారం. మరి కనీసం అప్పుడైనా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి . పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.