Samantha : ” నా వల్ల కాదంటే కాదు .. ” చేతులెత్తేసిన సమంత .. అత్యంత దారుణమైన నిర్ణయం !

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం దృష్ట్యా తన చేతిలో ఉన్న సినిమాలు చేస్తే చాలని సమంత డిసైడ్ అయిందట.. అంతేకాదు ఫ్యామిలీ మెన్ సిరీస్ విజయం తరువాత బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన సమంత.. ఇప్పుడు బాలీవుడ్ వైపే చూడాలని అనుకోవడంలేదుట..

Samantha hands up on movie shooting
Samantha hands up on movie shooting

సమంత తన ఆరోగ్యం కుదుటపడే వరకు లాంగ్ గ్యాప్ తీసుకోవాలని నిర్మాతలకు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటివరకు టాలీవుడ్ బాలీవుడ్ డైరెక్టర్లకు ససే మీరా షూటింగ్ నావల్ల కాదంటే కాదు అని సమంత చేతులెత్తేసిందట.. ఇప్పటికే సమంతను నమ్ముకుని బాలీవుడ్ డైరెక్టర్స్ ఆమె కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాము అంటే ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకుంటుందని తెలిసి ఆల్టర్నేట్ హీరోయిన్ వెతుక్కునే దారిలో ఉన్నారట. ఇక తెలుగులో సమంత పూర్తి చేయాల్సిన సినిమా ఏదైనా ఉంటే అది విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి సినిమా నే ఇక ఈ సినిమా లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తుందా.. చేయదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కానీ సమంత ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడితే చాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.