BalaKrishna : నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న సంగతి తెలిసిందే.. ఈ ఎపిసోడ్ సంక్రాంతికి విడుదల కానుంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య జరిగే సంభాషణలు.. బాలయ్య పవన్ ను ఏం ప్రశ్నలు అడిగారు.. పవన్ చెప్పే సమాధానం ఏంటి అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.. ఈ ప్రశ్నలు బాలకృష్ణ పవన్ ను అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ముందుగా 2014లో ఏ విధమైన పదవి ఆశించకుండా టిడిపికి నిండు మనసుతో మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పమన్నారని.. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటారనేది మరొక ప్రశ్న.. ఈ షో మధ్యలో పవన్ కళ్యాణ్ ను చిరంజీవితో వీడియో కాల్ మాట్లాడించే అవకాశం ఉందని. ఆ చిట్ చాట్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని.. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ క్రిష్ దర్శకులు ఈ షోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హరిహర వీరముల్లు గురించి కాసేపు ఆసక్తికర చర్చ నడవనుందని.. ఇక ఫైనల్ గా టిడిపి పొత్తు గురించి స్పష్టత వచ్చే ప్రశ్నలు ఉంటాయని.. అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు టాపిక్.. విశాఖ నోబెటెల్ హోటల్ అంశాలను స్పృశించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మొత్తానికి ఈ ఎపిసోడ్ కోసం సినీ ప్రేక్షకులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ 2023 సంక్రాంతి జనవరిలో స్ట్రీమింగ్ కావచ్చని.. ఇదే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ అని కూడా అంటున్నారు.