Singer Sunitha : సింగర్ సునీత లీడ్ గా – ఆ సినిమా రీమేక్ … ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సూపర్ న్యూస్ !

Singer Sunitha :  అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న అతిలోక సుందరి దివంగత శ్రీదేవి. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. 80వ దశకంలో హీరోయిన్ గా కనీ వినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత 1997లో నటనా జీవితానికి కాస్త విరామం ఇచ్చి.. మళ్లీ 2012లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

singer-suneetha-lead-role-that-sredevi-movie-remake
singer-suneetha-lead-role-that-sredevi-movie-remake

ఇంగ్లీష్- వింగ్లీష్ సినిమాతో మళ్లీ వెండితెరపై మెరిశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడే ఇంగ్లీష్- వింగ్లీష్ సినిమా రీమేక్ లో టాలీవుడ్ సింగర్ సునీత నటించున్నారని సమాచారం..సింగర్ సునీత ఒక సంప్రదాయమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి తెలుగు సాంప్రదాయాన్ని ఎక్కడ మరిచిపోకుండా..

ఈ సినిమా అంతా కూడా చక్కని చీర కట్టులో అచ్చ తెలుగు గృహిణిగా కనిపించింది. ఇప్పుడు అదే పాత్రలో సింగర్ సునీత కూడా నటించనుందని ఇంగ్లీష్ వింగ్లీష్ లో తను నటిస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ అధికారికంగా రాలేదు కానీ త్వరలోనే సింగర్ సునీత ఈ సినిమాలో నటిస్తుందని అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఏది ఏమైనా సరే శ్రీదేవి నటించిన సినిమా రీమేక్ లో సింగర్ సునీత నటించిన ఓ వరం అనే చెప్పుకోవాలి.