Mahesh Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండిగా మారింది.. ఒకప్పుడు వివాదాల్లో చిక్కుకున్న వీరి విషయం ఇప్పుడు సుఖాంతం అయింది. అయితే ఈ విషయంపై నరేష్ తమ్ముడు మహేష్ బాబు ఎలా రియాక్ట్ అయ్యారు అనే ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది..
నరేష్ కి పవిత్ర లోకేష్ తో ఇది నాలుగవ పెళ్లి. నరేష్ మూడో భార్య రమ్య తో చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయట నరేష్ కి.. మహేష్ తన బ్రదర్ లీగల్ గా ఏ నిర్ణయం తీసుకున్న సపోర్ట్ గా ఉంటా అన్నాడు.. తండ్రి కృష్ణ లేకపోవడం తో ఫ్యామిలీ కి మహేష్ పెద్ద దిక్కు గా ఉన్నాడు.. నరేష్ ఇంత త్వరగా ఆ లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడడానికి ఒక రకంగా మహేష్ యే కారణం.
నరేష్ తో రమ్య లీగల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆయన ఇష్టపడిన పవిత్ర లోకేష్ తో కూడా ముందు ముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా మహేష్ వారితో చర్చలు జరిపారట. మొత్తానికి మహేష్ దగ్గరుండి తన అన్నయ్యని ఓ ఇంటి వాడిని చేయడానికి హెల్ప్ చేశాడట. మహేష్ ఇచ్చిన బూస్టర్ తో నరేష్ పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆమెతో ఉన్న కొన్ని ఫోటోలని లిప్ లాక్ ఫోటోని నరేష్ షేర్ చేయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.