prabhas : షారూఖ్ కి దవడ వాచిపోయే బ్రేకింగ్ న్యూస్ : ప్రభాస్ హీరో గా ఇండియా లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా మొదలైంది !

prabhas : ఇప్పుడు బాలీవుడ్ మొత్తం పఠాన్ మ్యానియాతో ఊగిపోతుంది.. బాలీవుడ్ లో సరైన ఇప్పడి చాలా కాలమే అయింది ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ దాహంతో ఎదురు చూస్తుంటే.. సరైన సమయంలో బాలీవుడ్ బాద్షా పఠాన్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని సృష్టించాడు.. కేవలం వారం రోజుల్లోనే 700 కోట్ల రూపాయలను వసూలు చేసి బాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు..

Siddarth anandh direction Prabahs movie budget is creat on Indian history
Siddarth anandh direction Prabahs movie budget is creat on Indian history

బాలీవుడ్ కి పూర్వ వైభవం సంతరించుకునేలా చేసింది అందుకు కారణమైన ఈ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. పఠాన్ సినిమాతో షారుక్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాడు సిద్ధార్థ్ ఆనంద్.. పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటంతో సిద్ధార్థ్ ఆనంద్ నెక్స్ట్ సినిమా ఏంటని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు..

సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో ఓ సినిమా చేనున్నారు. ఆ తర్వాత ప్రభాస్ తో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల వార్త గానాలు వినిపించాయి. ఇక సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు మైత్రి మూవీస్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాను సుమారు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని సమాచారం. ఇదే నీది నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీ లోనే మొదటిసారి ఇంత భారీ బడ్జెట్ సినిమా రానుంది.. మరోవైపు సిద్ధార్థ్ ఆనంద్ ఇంత భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేయగలరా అని టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 500 కోట్ల బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కాయి. ఇప్పుడు ఆ బడ్జెట్ కి మూడు రెట్లు ఈ సినిమా బడ్జెట్ ఉంది. ఎలా మేనేజ్ చేస్తాడా అనేది ఓ టాక్ వినిపిస్తుంటే.. మరోవైపు పఠాన్ కి మించిన బడ్జెట్ తో పాటు భారీ వ్యూహంతో సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ ని తెరమీద చూపించబోతున్నాడని.. ఈ సినిమా ఇండియా హిస్టరీలోనే బెస్ట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి.