Rashmi : బుల్లితెరపై రష్మీ సుధీర్ జంటకు ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీళ్ళిద్దరూ పక్క పక్కన నిలబడే కనిపిస్తే చాలు బుల్లితెర ప్రేక్షకులకు పునాకలు తెప్పించినట్లే.. వీళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ అభిమానుల మనసుల్లో మాత్రం వీరిద్దరూ భార్యాభర్తలు గాని స్థిరపడిపోయారు..
ఇప్పటికీ రష్మీ పక్కన సుధీర్ పేరు లేకపోయినా సుదీర్ పక్కన రష్మీ పేరు లేకపోయినా జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటారు. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సుదీర్ ఇటీవల జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.. సుధీర్ మళ్లీ జబర్దస్త్ కి వస్తాడు.. రి ఎంట్రీ ఇస్తాడు అంటూ వార్తలు వినిపించినా.. మరో వైపు తను జబర్దస్త్ లోకి రాకుండా విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కొంతమంది.
మరోవైపు రేష్మి కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం టాలీవుడ్ బుల్లితెర హాట్ యాంకరమ్మ అని జనాలు అంటున్నారు. సుధీర్ రష్మీ పెయిర్ అంటూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సమయంలో.. ఈ యాంకర్ తో సుధీర్ రొమాన్స్ చేసి మరో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు. అంతేకాదు ఇప్పటికీ సుదీర్ తో రాసుకొని పోసుకొని తిరుగుతున్న ఈ యాంకర్ కి రేష్మి అంటే అసలు పడదట ..
ఒకే ఈవెంట్లో వీళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా కానీ మాట్లాడుకోరని సుధీర్ ని జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి ఆ యాంకర్ ఎన్నో ప్రయత్నాలు చేసిందని.. అవి ఫలించకపోయినా ఎట్టకేలకు ఆమె అనుకుంది జరిగింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె ఎవరితోనో ఫోన్లో ఈ విషయాల గురించి చర్చించగా.. ఫోన్ కాల్ లో సంభాషించిన మాటలు బయటికి వచ్చాయి. దాంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా సుధీర్ రష్మి జంటగా మళ్లీ యాంకరింగ్ చేయాలని.. వాళ్ళిద్దరూ కలిసి ఓ షో చేస్తే చూడాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.