కేర్ ఫుల్ అబ్బాయిలూ :: పెళ్లి కూతురు చాలా బాగుంది అని ఎగబడి పెళ్లి చేసుకున్నాడు .. రెండో రోజే పేలింది బాంబు లాంటి న్యూస్ !

 

Marriage: పెళ్లంటే అటు ఏడు తరాలు ఎటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి పరిస్థితులలో ఏళ్ల కొరత ఉండటంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని ఆరాలు తీయలేకపోతున్నారు.. అమ్మాయి దొరికితే చాలు మా అబ్బాయికి పెళ్లి జరిగితే చాలు అనుకునే పరిస్థితికి వచ్చాయి నేటి పరిస్థితులు.. దాంతో ఇటీవల పెళ్ళిల పేరిట మోసాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.. దీనిని అవకాశం గా చేసుకొని కొంతమంది ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే గుంటూరు జిల్లా పరిధిలో చోటు చేసుకుంది..

Guntur srinivasarao married a beautiful girl finally tragedy end
Guntur srinivasarao married a beautiful girl finally tragedy end

గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ రావు ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం మోటో కంట్రోలర్ మెకానిక్ గా పని చేస్తున్నారు . అతని తండ్రి పోలియోతో బాధపడుతున్నారు. అతనికి అనారోగ్యంతో బాధపడుతుంది. దాంతో శ్రీనివాసరావుకి పెళ్లి చేయాలనుకున్నారు వారి తల్లిదండ్రులు.

 

దాంతో వారికి తెలిసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ ద్వారా వారికి ఓ సంబంధం వచ్చింది . రెండు వైపులా నచ్చడంతో ముందుకెళ్లి మిగతా విషయాలు చర్చించుకున్నారు.. ఆ అమ్మాయికి తండ్రి లేడు. దాంతో శ్రీనివాస్ పెద్ద మనసు చేసుకొని కట్నం లేకుండానే ఆ యువతీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళిలో రెండు లక్షలు పెట్టి ఉన్నంతలో బంగారం చేయించాడు. ఆరు లక్షలు ఖర్చుపెట్టి ఊర్లో ఘనంగా రిసెప్షన్ కూడా చేసుకున్నాడు. ఇంతవరకు బానే ఉంది . పెళ్లి అయిన రెండో రోజు నుంచి ఆ అమ్మాయి తనని దూరం పెడుతుంది

 

తరువాత నుంచి మాది ఏదో ఒక కారణం చెప్పి శ్రీనివాస్ని దూరంగా పెట్టేది. కొన్నాళ్ల తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి చూసి వస్తానని తన పుట్టింటికి వెళ్ళింది. రెండు మూడు నెలలు గడిచినా కూడా ఆమె తిరిగి రాలేదు. దాంతో ఎందుకు రాలేదు అంటూ శ్రీనివాసరావు ఆరా తీశాడు.. అప్పుడే ఊహించని నిజం బయటపడింది..

 

ఆ అమ్మాయి కి గతంలోనే ఒకరితో ముందుగానే పెళ్లి జరిగిందని తెలిసి షాక్ అయ్యాడు. తనని మోసం చేశారని భావించి శ్రీనివాస్ ఆ యువతి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకున్నాడు. తీరా ఏం జరిగిందో చూశారు కదా.. పెళ్లిళ్ల విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి అబ్బాయిలు అంటూ ఈ న్యూస్ చదివిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. అందుకే పెద్దలు చెప్పినట్టు పెళ్లిళ్ల విషయంలో ఆచితూచి ముందుకి అడిగేయాలి.